Home సినిమా టాలీవుడ్ న్యూస్ పవన్ సినిమాల జాబితా చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

పవన్ సినిమాల జాబితా చూస్తే నోరెళ్లబెట్టాల్సిందే!

List Of Pawan Kalyan Movies

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ దాదాపు రెండేళ్ల తరువాత సినిమాల్లో రీఎంట్రీ ఇస్తూ నటిస్తోన్న చిత్రం ‘వకీల్ సాబ్’. బాలీవుడ్‌లో వచ్చిన పింక్ చిత్రానికి రీమేక్‌గా ఈ సినిమా వస్తుండటంతో పవన్ ఈ సినిమాతో ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో పవన్ లాయర్ పాత్రలో నటిస్తుండటంతో ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఫ్యాన్స్ ఆశగా ఉన్నారు.

కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే పవన్ తన నెక్ట్స్ చిత్రాలను లైన్‌లో పెడుతున్నాడు. ఇప్పటికే దర్శకుడు క్రిష్ డైరెక్షన్‌లో తన నెక్ట్స్ మూవీని ఓకే చేసిన పవన్, ఈ సినిమాను అతి త్వరలో ప్రారంభించాలని చూస్తున్నాడు. కాగా ఈ సినిమా తరువాత మరోసాగి గబ్బర్‌సింగ్ డైరెక్టర్ హరీష్ శంకర్‌తో సినిమా చేసేందుకు పవన్ పచ్చ జెండా ఊపేశాడు. అటు దర్శకుడు డాలీ చెప్పిన కథకు కూడా పవన్ ఓకే అనేశాడని, త్వరలోనే వీరి కాంబోలో సినిమా రానుందని ఇండస్ట్రీ వర్గాలు అంటున్నాయి.

దీంతో పాటు సైరా నరసింహారెడ్డి తరువాత తనకు ఎవరూ ఛాన్స్ ఇవ్వకపోవడంతో దర్శకుడు సురేందర్ రెడ్డి, తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌ను పవన్‌తో చేసేందుకు ఓకే చేయించుకున్నాడు. అటు పవన్ ఆప్తమిత్రుడు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్‌తో మరో సినిమా చేసేందుకు పవన్ ప్లాన్ చేస్తున్నట్లు గతంలోనే వార్తలు రావడంతో, వీరి కాంబోలో ఓ సినిమా ఎప్పుడైనా రావచ్చని తెలుస్తోంది. మొత్తానికి పవన్ ఇలా రెండేళ్ల తరువాత రీఎంట్రీ ఈ రేంజ్‌లో ఎందుకు ఇస్తున్నాడు? అనే ప్రశ్న ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది.

అయితే ఈ విషయంపై సినీ వర్గాల్లో ఓ వార్త జోరుగా వినిపిస్తోంది. పవన్ 2019 ఎన్నికల్లో ఓడిపోవడంతో సినిమాల్లోకి రీఎంట్రి ఇస్తున్నాడని, రాబోయే 2024 ఎన్నికల్లోనూ గెలుస్తామనే పవన్ వర్గానికి లేదని అందుకే ఆయన ఈ విధంగా సినిమాలను వరుసగా లైన్‌లో పెడుతున్నాడనే వార్త వినిపిస్తోంది. అయితే ఇదంతా కేవలం ట్రాష్ అని, పవన్ 2024 ఎన్నికల కోసం రాజకీయాల్లో పూర్తిగా బిజీ కానున్నాడని, ఆ లోపే వీలైనన్ని సినిమాలు పూర్తి చేయాలని చూస్తున్నాడని పవన్ అభిమానలు, సన్నిహితులు అంటున్నారు. మరి ఈ వార్తల్లో ఎంత వరకు నిజం ఉందో చూడాలి అంటున్నారు క్రిటిక్స్.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad