Home సినిమా టాలీవుడ్ న్యూస్ మ‌హేశ్ వ‌దిలేసిన సినిమాలు ఇవే....

మ‌హేశ్ వ‌దిలేసిన సినిమాలు ఇవే….

mahesh babu thumb 3

కొంత మంది స్టార్ల ద‌గ్గ‌ర‌కు కొన్ని క‌థ‌లు వ‌స్తుంటాయి. అవి న‌చ్చ‌కో లేదంటే ఇమేజ్‌కు సెట్ అవ్వ‌వ‌ని భావించో వాటిని వాదిలేసుకుంటూ ఉంటారు. ఆ త‌ర్వాత ఆ సినిమాలు వేరే స్టార్స్ దగ్గ‌ర‌కు వెళ్తుంటాయి. ఒక వేళ ఆ సినిమా ఫ్లాప్ అయితే సేఫ్‌. ఒక వేళ అది పెద్ద హిట్ అయితే మాత్రం….అబ్బా ఆ సినిమా ముందు నా ద‌గ్గ‌ర‌కే వ‌చ్చింద‌ని..కానీ వ‌ద్ద‌నుకున్నానే అని తెగ ఫీలైపోతుంటారు. అలా చాలా మంది స్టార్లు చాలా సినిమాలు వ‌దిలేసుకున్నారు. ఈ వ‌రుస‌లో ప్రిన్స్ మ‌హేశ్ బాబు కూడా ఉన్నారు. ఎన్నో సూప‌ర్ డూప‌ర్ హిట్ చిత్రాలు త‌న దాకా వ‌చ్చినా….ఏవేవో కార‌ణాల వ‌ల్ల సున్నితంగా తిర‌స్క‌రించారు మ‌న టాలీవుడ్ ప్రిన్స్‌. సూప‌ర్ స్టార్ కృష్ణ న‌ట‌వార‌సుడిగా ఎంట్రీ ఇచ్చిన మ‌హేశ్ బాబు….. త‌న టాలెంట్ తో సూప‌ర్ స్టార్ గా ఎదిగాడు. ఇప్ప‌టికే 26 సినిమాలు చేసిన మ‌హేశ్ ……ప్ర‌స్తుతం 27వ సినిమాగా స‌ర్కారు వారి పాట మూవీ ప్రీ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. లాక్ డౌన్ వ‌ల్ల ఆల‌స్యంగా సెట్స్ మీదికి రాబోతోంది. మ‌హేశ్ చేసిన 26 సినిమాల్లో బ్లాక్ బ‌స్ట‌ర్ గా నిలిచి కెరీర్‌ని అమాంతం పెంచిన సినిమాల‌తో పాటు…… కెరీర్ దెబ్బ‌తీసిన మూవీస్ కూడా ఉన్నాయి. అయితే 13 సినిమాలు చేతిదాకా వ‌స్తే వ‌దిలేశాడు. అలా వ‌దిలేసుకున్న సినిమాల్లో విభిన్న అంశాల మూవీస్ ఉండ‌డంతో ……అవి చేస్తే ఇమేజ్ మ‌రింత పెరిగేది.

కానీ వాటిని వేరేవాళ్లు చేసి ఆ క్రెడిట్ ద‌క్కించుకున్నారు. ఎస్వీ కృష్ణారెడ్డి ఆలీతో తీసిన య‌మ‌లీల మూవీని మ‌హేశ్ కోసం రెడీ చేశారు. కానీ మ‌హేశ్ స్ట‌డీస్ ఉన్నందున ఇప్పుడొద్ద‌ని
సున్నితంగా కృష్ణ తిర‌స్క‌రించారు. నువ్వేకావాలి మూవీ రీమేక్ కోసం దాని ఒరిజిన‌ల్ సీడీని స్ర‌వంతి ర‌వికిషోర్‌…మ‌హేశ్‌కి పంపిస్తే ఎలాంటి రెస్పాన్స్ రాలేదు. దీంతో దాన్ని త‌రుణ్ లాంచింగ్ సినిమాగా అయ్యింది. బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అయ్యింది. ఇడియ‌‌ట్ మూవీ కోసం ర‌వితేజ క న్నా ముందే న‌లుగురు హీరోల‌ను ద‌ర్శ‌కుడు పూరీ జ‌గ‌న్నాథ్ కాంటాక్ట్ చేశాడు. అందులో మ‌హేష్ ఒక‌డు. ఇలాంటి పాత్ర‌లో ఆడియ‌న్స్ న‌న్ను చూడాలేర‌ని రిజెక్ట్ చేశాడు. అది ర‌వితేజ చేశాడు. ఆ సినిమా ర‌వితేజ‌ను స్టార్ హీరోగా చేసింది. ఇక మ‌న‌సంతా నువ్వే మూవీ కోసం నిర్మాత ఎం ఎస్ రాజు అడిగితే……. త‌ప్ప‌కుండా వేరే మూవీ చేద్దాం ఇప్పుడు డేట్స్ లేవ‌ని చెప్పేశాడు మ‌హేశ్‌. దీంతో దాన్ని ఉద‌య్ కిర‌ణ్ చేశాడు. అది ఎంత పెద్ద హిట్ అయ్యిందో అంద‌రికీ తెలిసిందే. తెలుగు త‌మిళ భాష‌ల్లో బ్లాక్ బ‌స్టర్ హిట్ కొట్టిన గ‌జినీ మూవీ రీమేక్ కోసం….. ద‌ర్శ‌కుడు మురుగుదాస్ ఏడుగురు హీరోల‌ను క‌లిశాడు. దాంట్లో మ‌హేశ్ ఒక‌డు. అయితే మ‌హేశ్ ఆ క్యారెక్ట‌ర్ చేయ‌లేన‌ని చెప్పేశాడు. దీంతో దాన్ని డ‌బ్బింగ్ చేసి రిలీజ్ చేస్తే బ్లాక్ బ‌స్ట‌ర్ అయింది.

ఇక మ‌హేశ్ కోసం లీడ‌ర్ మూవీ క‌థ‌ను సిద్ధం చేసి తీసుకెళ్తే….దానికి క‌మ‌ర్షియ‌ల్ హంగులు యాడ్ చేయ‌మ‌ని సూచించాడ‌ట మ‌హేశ్‌‌. కానీ డైరెక్ట‌ర్ శేఖ‌ర్ క‌మ్ముల ఆ రూట్ లోకి వెళ్లలేక‌పోయాడు. దీంతో ఆ సినిమా ద‌గ్గుబాటి వార‌సుడు రానాకు లాంచింగ్ సినిమా అయ్యింది. మ‌హేశ్ కోసం గౌత‌మ్ మీన‌న్ ఏం మాయ‌చేసావే మూవీ త‌యారు చేశాడు. కానీ ఆ స‌మ‌యంలో ఖ‌లేజా షూటింగ్ లో బిజీగా ఉండ‌డంతో ……స్టోరీ కూడా విన‌కుండా రిజెక్ట్ చేసేశాడు. అది నాగ‌చైత‌న్య‌కు ద‌క్కింది. అది కూడా మంచి హిట్ గా నిలిచింది. ఇక రుద్ర‌మ‌దేవిలో గోన గ‌న్నారెడ్డి పాత్ర‌కు మొద‌ట‌ మ‌హేశ్ ని అనుకున్నారు. కార‌ణాలు ఏమిటో తెలియ‌దు గానీ అదీ చేజారింది. ఇక విక్ర‌మ్ న‌టించిన 24 మూవీ కూడా తొలుత మ‌హేశ్ ద‌గ్గ‌ర‌కే వ‌చ్చింది. కొన్ని మార్పులు చేయ‌మ‌ని మ‌హేశ్ సూచించాడు. కానీ అది విక్ర‌మ్ కుమార్‌కి ఇష్టం లేక‌పోవ‌డంతో…. హీరో సూర్య చేశాడు. త్రివిక్ర‌మ్ శ్రీనివాస్ అ ఆ మూవీని మ‌హేశ్ కోసం రాయ‌డం, నచ్చ‌డం అయ్యాయి. కానీ డేట్స్ కుద‌ర‌క వ‌దులుకున్నాడు. ఇక లీడ‌ర్ కుద‌ర‌క‌పోవ‌డంతో ఫిదా మూవీని వినిపించాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. కానీ మ‌ళ్లీ నిరాశ ఎదురైంది. డేట్స్ వ‌ల్ల మ‌హేశ్ వ‌దిలేసిన ఈ మూవీ …..వ‌రుణ్ తేజ్ కెరీర్‌ని మ‌లుపు తిప్పింది. అలాగే విక్ర‌మ్ కుమార్ ముందుగా గ్యాంగ్ లీడ‌ర్ క‌థ‌ను మ‌హేశ్‌కు చెబితే..రిజెక్ట్ చేశాడు. ఇక మ‌హేశ్‌ని డిఫ‌రెంట్‌గా చూపించాల‌‌ని పుష్ప మూవీని… ఏడాది పాటు సుకుమార్ క‌ష్ట‌ప‌డి త‌యారు చేస్తాడు. కానీ క్యారెక్ట‌ర్ చేంజ్ చేస్తే చేద్దామ‌న‌డంతో….పుష్ప క‌థ బ‌న్నీ ద‌గ్గ‌ర‌కు వెళ్లిపోయింది. అలా కొన్ని పెద్ద హిట్ చిత్రాల‌ను మ‌హేశ్ వ‌ద‌లుకున్నాడు. అవి చేస్తే మ‌హేశ్ కెరీర్ ఇంకా ఏ రేంజ్ లో ఉండేదో అని ఇప్పుడు ఫ్యాన్స్ అనుకుంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad