Home సినిమా టాలీవుడ్ న్యూస్ చిట్టిబాబుగా మారుతున్న కాంచన హీరో

చిట్టిబాబుగా మారుతున్న కాంచన హీరో

raghava lawrence thumb

టాలీవుడ్‌లో తరకెక్కి్న చాలా సినిమాలను ఇతర భాషల్లో రీమేక్ చేస్తూ అదిరిపోయే సక్సె్స్‌ను అందుకుంటున్నారు. కాగా తెలుగులో వచ్చిన పక్కా రివెంజ్ డ్రామా మూవీ ‘రంగస్థలం’ బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సెన్సేషనల్ హిట్ మూవీగా నిలిచిందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అదిరిపోయే పర్ఫార్మెన్స్‌తో ప్రేక్షకులను కట్టిపడేశాడు. ఇక స్టార్ డైరెక్టర్ సుకుమార్ ఈ సినిమా తనదైన మార్క్‌తో తెరకెక్కించి బాక్సాఫీస్ బ్లాక్‌బస్టర్ మూవీగా నిలిపాడు.

కాగా ఇప్పుడు ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నారు. తమిళ హీరో కమ్ దర్శకుడు రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో ఈ సినిమాను తమిళంలో రీమేక్ చేసేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. ఈ సినిమాలో చెవిటివాడైన చిట్టిబాబు పాత్రలో పరకాయ ప్రవేశం చేసేందుకు లారెన్స్ రెడీ అవుతన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ సినిమాలో సమంత, జగపతిబాబు, అనసూయ లాంటి పాత్రలను ఎవరు పోషిస్తారా అనే అంశం ప్రస్తుతం కోలీవుడ్ వర్గా్ల్లో హాట్ టాపిక్‌గా మారింది.

ఇప్పటివరకు హార్రర్ చిత్రాల్లో నటిస్తూ తమిళ, తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న రాఘవ లారెన్స్, ఇప్పుడు రంగస్థలం రీమేక్‌తో ఎలాంటి ఇంప్రెషన్ సాధిస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఈ సినిమాను వీలైనంత త్వరగా పట్టాలెక్కించేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతున్నట్లు కోలీవుడ్ వర్గాల్లో వార్తలు వినిపిస్తున్నాయి. మరి ఈ సినిమాను ఎవరు డైరెక్ట్ చేస్తున్నారు, ఎవరు ప్రొడ్యూస్ చేస్తున్నారు అనే అంశాలు కూడా ఇంకా తెలియాల్సి ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad