వివాదాస్పద దర్శకుడు రాంగోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకు సంబంధించి వస్తున్న ప్రతి ఛాన్స్ ను వాడేసుకుంటున్నాడు. ఇప్పటికి విడుదలైన టీజర్ , ట్రైలర్ , పాటలు అభిమానులలో ఎప్పుడెప్పుడు విడుదలవుతుందాని ఉత్కంఠను రేపాడు. ఈ నెల 22న విడుదల చేయటకు సిద్దమై సెన్సర్ తో తలెత్తిన కారణాల వలన మార్చి 29 కి వాయిదా వేసి ప్రేక్షకులకు నిరాశే మిగిల్చాడు.
‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ సినిమాకున్న కొద్దీ పాటి సమయాన్ని కూడా చిత్ర ప్రమోషన్స్ కు వాడేస్తున్నాడు. ఈ నేపథ్యంలో ‘ఫేస్ టు ఫేస్’ ఇంటర్వ్యూ కోసం టీవీ 5 ఛానెల్ కు వెళ్లిన ఆర్జీవీ న్యూస్ ప్రజెంటర్ అవతారమెత్తాడు. ఆ షోలో నున్న యాంకర్ మూర్తి ‘ఈరోజు మనకు హెడ్ లైన్ అందిస్తున్నాడు. సంచలన దర్శకుడు రాంగోపాల్ వర్మ’. అని మొదలుపెట్టాడు. అంతే ఇక మూర్తి చెప్పాల్సిన బులిటెన్ హెడ్ లైన్స్ ని వర్మ చదివాడు. వర్మ మల్టీటాలెంట్ గూర్చి ప్రత్యేకంగా చెప్పాలా… అభిమానులంతా మూర్తి కన్నా మీరే బాగా చదివారంటూ నెటిజన్స్ కామెంట్స్ వర్షం కురిపించారు. వర్మ తడబడకుండా ఆన్ ఎయిర్ విజువల్స్ కి పర్ఫెక్ట్ గా హెడ్‌లైన్స్ చక చక చదివారు.
వర్మ వార్తలు చదవడం మొదలు పెట్టగానే, యాంకర్ మూర్తి అవాక్కయ్యాడు. హెడ్ లైన్ చదివిన వెంటనే మూర్తి అమితాబచ్చన్ లాంటి వాళ్ళను డైరెక్ట్ చేసిన రాంగోపాల్ వర్మగారిని ఈరోజు నేను డైరెక్ట్ చేశా.. ఆయన యాంకర్ గా హెడ్ లైన్స్ చదివారు. గ్రేట్ మై డే అంటూనే.. యాంకర్ గా తాను అడగలాల్సిన ప్రశ్నలు అడిగేశాడు.
‘చాలా బాగా చదివారు వర్మ .. టెన్షన్ ఏమైనా ఫీల్ అయ్యారా ?’ అని అడగగానే కొంచెం అని ఆర్జీవీ చెప్పారు. ‘ఎక్కడ టెన్షన్ పడ్డారు.. చంద్రబాబుని పొగుడుతూ, పవన్ ని కామెంట్ చేసినప్పుడా ? జగన్‌కి ఓటు వేయద్దు అని చదివినప్పుడా? ‘అంటూ మూర్తి వ్యంగమైన ప్రశ్న వేశాడు. వర్మ సమాధానంగా కాదు హెడ్ లైన్స్ కమాండ్ బులిటెన్ టైం కి చెప్పగలుగుతానా? లేదా? అని మాత్రమే అంటూ తనదైన శైలిలో చెప్పాడు. తాజాగా వర్మ మొదటి సారి న్యూస్ హెడ్ లైన్స్ చదివానంటూ వీడియోని షేర్ చేశాడు.