రామ్ గోపాల్ వర్మ దర్శకత్వం వహించిన ‘లక్ష్మీస్ ఎన్టీఆర్‘ ఎన్నో వివాదస్పదాల మధ్య రిలీజ్ కాబడింది. ఆంధ్రప్రదేశ్ లో తప్ప ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన సంగతి తెలిసిందె. ఆంధ్ర ప్రదేశ్ లో విడుదల కాకూడదని ఏపీ హైకోర్టు ఇచ్చిన స్టేకి వర్మ సుప్రీం కోర్ట్ ని ఆశ్రయించారు. సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేయగా, అత్యవసర విచారణ చేపట్టడం కుదరదని తేల్చి చెప్పేసింది అంతే కాకుండా, సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ పిటిషన్ డిస్మిస్ చేస్తూ ఏప్రిల్ మూడోవ తేదీన ఏపీ హైకోర్టు నిర్ణయం తీసుకునే వరకు వెయిట్ చేయాలని .. అక్కడ వ్యతిరేకత ఎదుర్కొనినపుడే మమ్మల్ని ఆశ్రయించాలని తెలియ చేశారు.
ఇక ఈ సంగతి ఇలా ఉంటె రేపు హైకోర్టు లో నిర్ణయం ఉండగానే .. మరో పక్క ఏపీ డిస్ట్రిబ్యూటర్ నట్టి కుమార్ నష్టపోయామంటూ.. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాపై వచ్చిన స్టే గూర్చి ఏపీ హైకోర్టును ఆశ్రయించబోతున్నారు. అని రామ్ గోపాల్ వర్మ తన ట్వీట్ లో పోస్ట్ చేసాడు. మరి ఇంతమంది సపోర్ట్ అందుకుంటున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ గూర్చి రేపు ఏపీ హైకోర్టు ఎలాంటి నిర్ణయాన్ని తీసుకుంటుందోనని అందరూ ఆసక్తి తో ఎదురు చూస్తున్నారు.