
టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ క్రిష్ సక్సెస్ఫుల్ చిత్రాలతో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. కాగా ప్రస్తుతం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో కలిసి తన నెక్ట్స్ మూవీని ఇప్పటికే అనౌన్స్ చేసిన క్రిష్, తాజాగా తన కొత్త చిత్రాన్ని కూడా ఓకే చేశాడు. ఈ సినిమాను ఇటీవల అనౌన్స్ చేసిన క్రిష్, ఈ సినిమాలో మెగా హీరో వైష్ణవ్ తేజ్‌ను తీసుకున్నాడు. కాగా ఈ సినిమాతో వైష్ణవ్ తేజ్ అదిరిపోయే సక్సెస్‌ను అందుకోవడానికి రెడీ అవుతున్నాడు.
అయితే క్రిష్ తన చిత్రాలకు ఎక్కువగా మెలోడీ అందించే సంగీత దర్శకులను పెట్టుకుంటాడు. ఈ క్రమంలో గతంలో ఎంఎం కీరవాణి, చిరంతన్ భట్‌లో పని చేసిన క్రిష్, తాజాగా ఈ సినిమాలో సంగీతం అందించేందుకు కీరవాణిని ఓకే చేసుకున్నాడు. వైష్ణవ్ తేజ్‌తో క్రిష్ తెరకెక్కించబోయే సినిమా పూర్తి రొమాంటిక్ ఎంటర్టైనర్గా ఉండబోతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇక ఈ సినిమాలో అందాల భామ రకుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్గా నటిస్తోన్నట్లు చిత్ర యూనిట్ పేర్కొంది.
కాగా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా క్రిష్ తెరకెక్కించబోయే సినిమాను అధికారికంగా ప్రకటించినా, షూటింగ్ మాత్రం ఇంకా మొదలుకాలేదు. అయితే ఈ సినిమా షూటింగ్ ఇప్పట్లో ప్రారంభమయ్యే సూచన కూడా కనిపించకపోవడంతో ఈ గ్యాప్‌లో క్రిష్ ఈ సినిమాను పూర్తి చేయాలని చూస్తున్నాడు. దీంతో ఈ సినిమాపై అటు ప్రేక్షకులతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లోనూ మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి. ‘ఉప్పెన’ చిత్రంతో హీరోగా ఎంట్రీ ఇస్తున్న వైష్ణవ్ తేజ్‌కు క్రిష్ ఎలాంటి సినిమాను అందిస్తాడో చూడాలి.