Home సినిమా టాలీవుడ్ న్యూస్ మెగా హీరోతో క్రిష్ చిత్రం.. ఎలా ఉండబోతుందో?

మెగా హీరోతో క్రిష్ చిత్రం.. ఎలా ఉండబోతుందో?

Krish New Movie With Vaishnav Tej

మెగా ఫ్యామిలీ నుండి వచ్చిన కొత్త హీరో వైష్ణవ్ తేజ్ తన తొలి చిత్రం ‘ఉప్పెన’ను రిలీజ్‌కు రెడీ చేశాడు. ఇప్పటికే ఈ సినిమా షూటింగ్ పనులు ముగించుకోగా, వేసవి కానుకగా రిలీజ్ చేయాలని చిత్ర యూనిట్ భావించింది. కానీ కరోనా వైరస్ ప్రభావంతో ఈ సినిమా రిలీజ్ వాయిదా పడింది. ఇక ఇప్పట్లో సినిమా థియేటర్లు తెరుచుకునే పరిస్థితి లేకపోవడంతో ఈ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుందా అనే అంశంపై క్లారిటీ లేదు.

ఈ సినిమా పోస్టర్స్, సాంగ్స్‌తో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పూర్తిగా సక్సెస్ అయ్యింది. ఇలా సినిమా రిలీజ్ కాకముందే ప్రేక్షకుల్లో మంచి క్రేజ్‌ను దక్కించుకున్న వైష్ణవ్ తేజ్, తన నెక్ట్స్ మూవీని ఓకే చేసేందుకు రెడీ అయ్యాడు. స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో వైష్ణవ్ తేజ్ తన నెక్ట్స్ మూవీని తెరకెక్కించేందుకు రెడీ అవుతున్నాడు. కాగా అందరికీ షాకిస్తూ ఈ సినిమా ముహూర్తం శుక్రవారం నాడు నిర్వహించినట్లు తెలుస్తోంది. క్రిష్ ఈ సినిమాను ఎప్పటినుండో తెరకెక్కించాలని చూస్తున్నాడని, హీరో కూడా ఓకే కావడంతో ఈ సినిమా ప్రారంభోత్సవం కూడా జరిగిపోయిందని చిత్ర వర్గాలు అంటున్నాయి.

ఇక ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్‌తో రొమాన్స్ చేసేందుకు అందాల భామ రకుల్ ప్రీత్ ఎంపికైనట్లు తెలుస్తోంది. గతంలో అన్న సాయి ధరమ్ తేజ్‌తో రొమాన్స్ చేసిన ఈ బ్యూటీ ఇప్పుడు తమ్ముడు వైష్ణవ్ తేజ్‌తో రొమాన్స్‌కు రెడీ అయ్యింది. ఇక ఈ సినిమా షూటింగ్‌ను కేవలం ఒక్క షెడ్యూల్‌లోనే ముగించేయాలని దర్శకుడు క్రిష్ ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం కరోనా ప్రభావం ఉండటంతో ఈ సినిమా షూటింగ్‌కు ఎక్కువ సమయం పట్టకపోవచ్చని చిత్ర వర్గాలు అంటున్నాయి. పవన్ కళ్యాణ్‌తో క్రిష్ తెరకెక్కించబోయే సినిమా ఇప్పట్లో మొదలయ్యే అవకాశం లేకపోవడంతోనే క్రిష్ ఈ సినిమాను తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad