Home సినిమా గాసిప్స్ కొరటాల శివ స్ట్రాటెజీకి టాలీవుడ్ షేక్

కొరటాల శివ స్ట్రాటెజీకి టాలీవుడ్ షేక్

Koratala Strategy Of Remuneration Becomes Hot Topic

టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ కొరటాల శివ ప్రస్తుతం మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ఆచార్య చిత్రాన్ని తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. పూర్తి కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు కొరటాల. కాగా ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్ రికార్డులను షేక్ చేసేందుకు చిరు రెడీ అవుతున్నాడు. ఇక ఈ సినిమాలో చిరు సరికొత్త లుక్‌లో మనకు కనిపిస్తాడని, ఆయన లుక్ మెగా ఫ్యాన్స్‌ను థ్రిల్ చేస్తుందని చిత్రయూనిట్ ముందునుండీ చెబుతూ వస్తోంది.

కాగా ఈ సినిమా కోసం దర్శకుడు కొరటాల భారీ రెమ్యునరేషన్ తీసుకుంటున్నాడు. అయితే ఆయన రెమ్యునరేషన్ తీసుకునే విధానం ఇప్పుడు టాక్‌ ఆఫ్ ది టౌన్‌గా మారింది. సినిమాకు సంబంధించి అన్ని రకాల బిజినెస్‌లలో 30 శాతం షేర్‌తో పాటు అడ్వాన్స్ రెమ్యునరేషన్‌గా రూ.15 కోట్లు ముట్టజెబితేనే కొరటాల శివ సినిమా చేసేందుకు ఒప్పుకుంటారని ఇండస్ట్రీ వర్గా్ల్లో టాక్ వినిపిస్తోంది. ఇంత భారీ మొత్తంలో రెమ్యునరేషన్ మరే డైరెక్టర్ తీసుకోవడం లేదని, కొరటాల మాత్రమే తనకున్న క్రేజ్‌ను పూర్తిగా క్యాష్ చేసుకుంటున్నాడని చిత్రపురిలో వార్తలు వినిపిస్తున్నాయి.

ఏదేమైనా ఆచార్య చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న కొరటాల ఇప్పుడు తన రెమ్యునరేషన్ కారణంగా టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారిపోయాడు. ఇక కొరటాల తెరకెక్కించిన ప్రతి చిత్రం బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్‌గా నిలవడంతోనే ఆయన ఈ తరహా భారీ రెమ్యునరేషన్ డిమాండ్ చేస్తున్నాడని, నిర్మాతలు కూడా అందుకు ఓకే అంటున్నారని టాలీవుడ్ వర్గాల టాక్. ఏదేమైనా కొరటాల రెమ్యునరేషన్ ప్రస్తుతం ఇతర దర్శకులకు అసూయ కలిగించేలా ఉందని సినీ క్రిటిక్స్ అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad