Home సినిమా కొర‌టాల శివ ప్లాన్..చిరంజీవిపై ప్రెష‌ర్

కొర‌టాల శివ ప్లాన్..చిరంజీవిపై ప్రెష‌ర్

AA-21

హిట్ చిత్రాల ద‌ర్శ‌కుడు కొర‌టాల శివ‌, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్  కాంబోలో సినిమాకు రంగం సిద్ధ‌మైంది. ఇప్ప‌టికే సినిమా కాన్సెప్టుకు సంబంధించిన పోస్ట‌ర్ ను రిలీజ్ చేశారు. సినిమా పోస్ట‌ర్‌ను చాలా వైవిధ్యంగా రూపొందించారు.  న‌ది ఒడ్డున న‌ది ఒడ్డున దూరంలో ఒక ఊరిని చూస్తున్న ఇద్ద‌రు వ్య‌క్తులతో ఉన్న పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అలానే అదే పోస్ట‌ర్ లో గ‌ద్ద‌లు తిరుగుతున్న ఆకాశం, ఒక ప‌క్క ప‌డ‌వ తెప్ప‌, కింద ప‌డిపోయిన లాంత‌ర్ కూడా ఉన్నాయి.  పోస్ట‌ర్‌ను గ్రే అండ్ రెడ్ క‌ల‌ర్ లో రూపొందించారు.

పోస్ట‌ర్ తో క‌థా తీరును చెప్పే ప్ర‌య‌త్నం చేసింది చిత్ర బృందం. అన్న‌ట్టు ఆ పిక్చ‌ర్ లో ఉన్న ఇద్ద‌రు వ్య‌క్తులు మ‌రెవ‌రో అనుకోకండి. అల్లు అర్జున్, కొర‌టాల శివ‌నే. మీరు బాగా గ‌మ‌నించి ప‌రిశీలిస్తే అర్ధ‌మౌతుంది. ఈ సినిమాను యోషిత ఫిల్మ్స్,  జీఏ ఆర్ట్స్ 2 బ్యానర్ల‌పై  ……కొర‌టాల శివ స్నేమితుడు సుధాక‌ర్ మిక్కిలినేని ,  అల్లుఅర్జున స్నేహితులు శాండి, స్వాతి క‌లిసి నిర్మించ‌బోతున్నారు. ఇది పాన్ ఇండియా సినిమాగా రూపొంద‌బోతుంది. పుష్ప సినిమా త‌ర్వాత అల్లు అర్జున్ చేస్తున్న పాన్ ఇండియా సినిమా ఇదే.  2022 మొద‌టి భాగంలో సినిమాను రిలీజ్ చేయ‌బోతున్న‌ట్టు పోస్ట‌ర్ లో ప్ర‌క‌టించారు. 

లాక్ డౌన్ స‌మ‌యంలో  కొర‌టాల శివ ….అల్లు అర్జున్  కోసం  ఈ సినిమా రాసుకున్నాడ‌ట‌. ఈ మూవీలో అల్లు అర్జున్ విద్యార్థి నాయ‌కుడిగా కన్పించ‌బోతున్నాడని తెలిసింది. యువ‌త‌ను రాజ‌కీయాల‌కు వైపుకు రావాల‌ని ప్రోత్స‌హించే యువ‌కుడిగా బ‌న్నీ క‌న్పిస్తాడు. ఒక మారుమూల గ్రామం నుంచి వ‌చ్చిన యువ‌కుడు….. విద్యార్థి నాయ‌కుడిగా ఎలా ఎదిగాడు..ఆ త‌ర్వాత రాజ‌కీయాల్లోకి ఎలా వ‌స్తాడు అనేది సినిమా క‌థాంశం.  ‌మెరుగైన స‌మాజం కోసం యువ‌త రాజ‌కీయాల్లోకి రావాల్సిన అవ‌స‌రాన్ని తెలిసేలా ఈ సినిమా ఉండ‌బోతుంద‌ట‌.

  ఇదే కోవ‌లో కొర‌టాల శివ రూపొందించిన  భ‌ర‌త్ అనే నేను సినిమా ఉంటుంది. అయితే అక్క‌డ సీఎం కొడుకే సీఎం అయ్యి….ప‌రిపాల‌న‌లో మార్పులు చేర్పులు తెస్తాడు. ఇక్క‌డ మాత్రం ఒక సామాన్య యువ‌కుడు….ఎలా రాజ‌కీయాల్లోకి వ‌స్తాడు అనేది చూపించ‌బోతున్నార‌ని తెలిసింది. ఈ సినిమా కోసం కొర‌టాల యువ రాజ‌కీయాల‌పై అధ్య‌య‌నం చేస్తున్ట్టు తెలుస్తుంది. ఇప్ప‌టికే విద్యార్థి రాజ‌కీయ‌లపై యువ‌, రంగం, నాగ లాంటి సినిమాల‌తో పాటు మ‌రికొన్ని  వ‌చ్చాయి. కొన్ని ప‌ర్వాలేద‌నిపించాయి. ఈ నేప‌థ్యంలో ఈ సినిమా ఎలా ఉండ‌బోతుంది అనేది ఆస‌క్తిని రేపుతోంది.

అయితే అల్లుఅర్జున్ పోస్ట‌ర్ దెబ్బ‌కు చిరంజీవి మైండ్ బ్లాక్ అయ్యింద‌నే టాక్ వినిపిస్తోంది. అల్లు అర్జున్ హ‌డావుడిగా ఈ పోస్ట‌ర్ రిలీజ్ చేయ‌డం వెనుక….. కొర‌టాల శివ ప్లాన్ ఉంద‌ని వాద‌న‌లు వినిపిస్తున్నాయి. దానికి కార‌ణాలు కూడా లేక‌పోలేదు. ఎందుకంటే చిరంజీవితో ఆచార్య అనే సినిమా తీస్తున్నాడు కొర‌టాల‌. ఈ సినిమా కొన్ని కార‌ణాల వ‌ల్ల ఆల‌స్య మైంది. కొవిడ్ తో మ‌రింత లేట్ అయ్యింది. ఈ సినిమా ఆల‌స్యం వ‌ల్ల….. టైమ్ బాగా  వేస్ట్ అయ్యంద‌నే భావ‌న‌లో ఉన్నాడ‌ట కొర‌టాల‌. అందుకే త‌న నెక్ట్స్ ఫిల్మ్ రిలీజ్ టైమ్ తో  స‌హా పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు అని అనుకుంటున్నారు.

త‌ద్వారా  ఆచార్య సినిమాను వీలైనంత త్వ‌ర‌గా కంప్లీట్ చేయాల‌నేది కొర‌టాల యోచ‌న‌.  అంటే ఫ‌ర్ ద‌ర్ గా ఆచార్య మూవీ ఎలాంటి లేట్ కాకుండా ఉండేలా…..ముందే ముందర‌కాళ్ల‌కు బంధం వేశాడ‌ని అంటున్నారు. కొర‌టాల‌తో  క‌లిసి అల్లుడు అల్లు అర్జున్…… చిరంజీవిపై  ప్రెష‌ర్ పెంచార‌నే అనుమానాలు వ్య‌క్త‌మౌతున్నాయి. ఒక సినిమా నిర్మాణ విలువపై చిరంజీవికి బాగా అవ‌గాహ‌న ఉంది. కాబ‌ట్టి సినిమాను లేట్ చేయాల‌ని ఎప్పుడు అనుకోరు. ఆచార్య సొంత సినిమా కాబ‌ట్టి మేబి పెద్ద‌గా చిరంజీవి ప‌ట్టించుకోలేదేమో కానీ….వేరే నిర్మాత ఎవ‌రైనా స‌రే చాలా బాధ్య‌తాయుతంగా న‌డుచుకుంటారు. సో కాబ‌ట్టి…అల్లు అర్జున్ కొర‌టాల అనుకున్న స‌మ‌యం క‌ల్లా….త‌న ఆచార్య సినిమాను అన్ని విధాలా పూర్తి చేసి వారి రూట్ క్లియ‌ర్ చేయాల్సిన ప‌రిస్థితి వ‌చ్చింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad