Home సినిమా ఆ న‌లుగురి స్టార్‌డ‌మ్ వెనుక కోడి రామ‌కృష్ణ కృషి..!

ఆ న‌లుగురి స్టార్‌డ‌మ్ వెనుక కోడి రామ‌కృష్ణ కృషి..!

మెగాస్టార్ చిరంజీవికి ఖైదీ చిత్రానికి ముందే స్టార్ క్రేజ్‌ను తీసుకొచ్చిన చిత్రం కోడి రామ‌కృష్ణ తెర‌కెక్కించిన ఇంట్లో రామ‌య్య వీధిలో కృష్ణ‌య్య. మెగాస్టార్ చిరంజీవికి హిట్ ఇవ్వ‌డ‌మే కాకుండా త‌న దివంగ‌త గురువు దాస‌రి నారాయ‌ణ‌లా త‌రంగిని, ముక్కుపుడ‌క వంటి చిన్న చిత్రాల‌తో మెప్పించి క్రేజీ డైరెక్ట‌ర్‌గా ఎదిగాడు. కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌క‌త్వంలో న‌టించాల‌ని ప్ర‌తిస్టార్ అనుకునేవారు. చిరంజీవి, బాల‌కృష్ణ‌, వెంక‌టేశ్‌, నాగార్జున ఈ న‌లుగురు స్టార్స్‌కు హిట్ ఇచ్చిన ద‌ర్శ‌కుడు కోడి రామ‌కృష్ణ మాత్ర‌మే.

ద‌ర్శ‌కుడి కార్డు కింద కోడి రామ‌కృష్ణ అనే పేరుంటే చాలు సినిమా గ్యారెంటీ హిట్ అన్న పేరును సంపాదించారు. ప్రేక్ష‌కుల్లో అంత‌లా న‌మ్మ‌కాన్ని క‌లిగించ‌డ‌మే కాదు.. నిల‌బెట్టుకున్నారు కూడా. ఇంట్లో రామయ్య వీధిలో కృష్ణ‌య్య త‌రువాత చిరంజీవితో తీసిన ఆల‌య శిఖ‌రం స‌క్సెస్ అయింది. ఆ త‌రువాత సింహ‌పురి సింహం, గూఢాచారి నెం.1, రిక్షావోడు, అంజి చిత్రాల‌ను తెర‌కెక్కించారు.

ఇక బాల‌య్య‌, కోడి రామ‌కృష్ణ కాంబినేష‌న్‌లో వ‌రుస‌గా నాలుగు హిట్స్ వ‌చ్చాయి. కోడి రామ‌కృష్ణ ద‌ర్శ‌కుడిగా బాల‌య్య‌తో ఆరు సినిమాలు తీయ‌గా, మంగ‌మ్మ‌గారి మ‌న‌వ‌డు, ముద్దుల కృష్ణ‌య్య‌, ముద్దుల మామ‌య్య‌, మువ్వా గోపాలం చిత్రాలు సాధించిన హిట్స్‌తో వీరిద్ద‌రి సూప‌ర్ హిట్స్ కాంబినేష‌న్‌గా ఉండేది. అలాగే విక్ట‌రీ వెంక‌టేశ్, కోడి రామకృష్ణ కాంబోలో వ‌చ్చిన శ‌త్రువు, శ్రీ‌నివాస క‌ల్యాణం ఘ‌న విజ‌యం సాధించింది. నాగార్జున‌తో తీసిన ముర‌ళీ కృష్ణుడు క‌మ‌ర్షియ‌ల్‌గా ఓకే అనిపించుకుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad