Home సినిమా గాసిప్స్ అయ్యబాబోయ్.. సీతగా మారుతున్న మహానటి?

అయ్యబాబోయ్.. సీతగా మారుతున్న మహానటి?

Keerthy Suresh To Play Seetha In Adipurush

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఇప్పటికే షూటింగ్ జరుపుకుంటోన్న సంగతి తెలిసిందే. కాగా ఈ సినిమా రిలీజ్ కాకముందే వరుసగా సినిమాలను ఓకే చేస్తూ లైన్‌లో పెడుతున్నాడు ప్రభాస్. తాజాగా ప్రభాస్ మరో భారీ పాన్ ఇండియా మూవీని ఓకే చేశాడు. బాలీవుడ్ దర్శకుడు ఓం రావుత్‌తో కలిసి ‘ఆదిపురుష్’ అనే సినిమాను తెరకెక్కించేందుకు ప్రభాస్ రెడీ అయ్యాడు. రామాయణం ఆధారంగా ఈ సినిమా కథ ఉండబోతున్నట్లు సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

కాగా ఈ సినిమాలో ప్రభాస్ పాత్ర ఏమిటా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అయితే ప్రభాస్ రాముడి పాత్రలో నటిస్తున్నట్లు ప్రముఖ దర్శకుడు నాగ్ అశ్విన్ లీక్ చేయడంతో ఇప్పుడు ఈ సినిమాలో సీతగా ఎవరు నటిస్తున్నారా అనే ప్రశ్నను లేవనెత్తుతున్నారు. కాగా ఈ సినిమాలో ప్రభాస్ సరసన అందాల భామ కీర్తి సురేష్‌ను తీసుకోవాలని చిత్ర యూనిట్ భావిస్తోందట. సీత పాత్రకు చాలా ప్రాముఖ్యత ఉంటుందని, ఆ పాత్ర చేసే హీరోయిన్ అందంతో పాటు హావభావాలను ఎక్కువగా ప్రదర్శించాల్సి ఉంటుందని చిత్ర యూనిట్ భావించారట.

Nag Ashwin Reveals Role Of Prabhas In Adipurush

దీంతో సీత పాత్రలో నటించేందుకు కీర్తి సురేష్ అయితే బాగుంటుందని చిత్ర యూనిట్ ఆలోచిస్తుంది. ఈ మేరకు మహానటి చిత్రంలో కీర్తి సురేష్ యాక్టింగ్‌కు ఫిదా అయిన చిత్ర యూనిట్, ఇప్పుడు సీత పాత్రలో ఆమెను తప్ప మరెవరినీ ఊహించుకోవడం లేదని ఫిలింనగర్ వర్గాలు అంటున్నాయి. మరి ఈ భారీ చిత్రంలో కీర్తి సురేష్ నటిస్తుందా లేక లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతోనే ముందుకు సాగుతుందా అనేది చూడాలి. ఏదేమైనా ఈ సినిమాలో సీత పాత్రలో అమ్మడు నటిస్తే, పాన్ ఇండియా స్టార్‌గా మారడం ఖాయమని పలువురు అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad