
అందాల భామ కీర్తి సురేష్ ఇటీవల వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే అమ్మడు నటించిన పెంగ్విన్ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యి యావరేజ్ మూవీగా నిలిచింది. కాగా ఈ సినిమా తరువాత కీర్తి సురేష్ వరుసబెట్టి సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలోనే ఆమె నటించిన తాజా చిత్రం ‘గుడ్ లక్ సఖి’ రిలీజ్‌కు రెడీ అయ్యింది. ఈ సినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తయినా, కొన్ని కారణాల వల్ల రిలీజ్ కాలేదు.
ఇక ఓటీటీ పుణ్యమా అని ఈ సినిమా రిలీజ్‌కు రెడీ అయ్యింది. కాగా స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఈ సినిమా టీజర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేశారు. ఈ టీజర్ చూస్తుంటే కీర్తి సురేష్ మరో హిట్ అందుకునేందుకు రెడీగా ఉన్నట్లు తెలుస్తోంది. ఓ పల్లెటూరి అమ్మాయి తన దురదృష్టాన్ని అధిగమింది అదృష్టంతో దేశ ప్రతిష్టను ఎలా ముందుకు తీసుకెళ్లిందనేది ఈ సినిమా కథగా కనిపిస్తోంది. షూటింగ్ ఆట నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తోంది. ఇక కీర్తి సురేష్‌కు కోచ్‌గా విలక్షణ నటుడు జగపతి బాబు నటిస్తున్నాడు. కాగా ఈ సినిమాలో ఆది పినిశెట్టి హీరోగా నటిస్తున్నాడు.
మొత్తానికి ఈసారి స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ చిత్రానికి దేశభక్తిని జోడించి ఓ ఫక్తు కమర్షియల్ సినిమాతో కీర్తి సురేష్ మన ముందుకు వస్తుందని చెప్పాలి. ఇక ఈ సినిమాను బాలీవుడ్ డైరెక్టర్ నగేష్ కుకునూర్ డైరెక్ట్ చేస్తుండటంతో ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేసేందుకు నిర్మాతలు ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాతో కీర్తి సురేష్‌కు నిజంగానే గుడ్ లక్ కలిసొస్తుందేమో చూడాలి. మరి ఈ టీజర్‌ను మీరూ ఓసారి చూసేయండి.