Home సినిమా టాలీవుడ్ న్యూస్ ఓటీటీ క్వీన్‌గా మారిన మహానటి

ఓటీటీ క్వీన్‌గా మారిన మహానటి

Keerthy Suresh Became OTT Queen

అందాల భామ కీర్తి సురేష్ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకునేందుకు చాలానే కష్టపడింది. ఇక ఆమె కెరీర్‌ను ఒక్కసారిగా మార్చిన చిత్రం ‘మహానటి’. ఆ సినిమాలో సావిత్రి పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన కీర్తి సురేష్, ఏకంగా జాతీయ ఉత్తమ నటి అవార్డును కూడా సొంతం చేసుకుంది. అయితే ఆ సినిమాతో ఆమె లేడీ ఓరియెంటెడ్ చిత్రాలకు కేరాఫ్‌గా మారిపోయింది. గతకొంత కాలంగా కీర్తి సురేష్ ఎక్కువగా ఇలాంటి సినిమాలనే తెరకెక్కి్స్తూ ప్రేక్షకులను అలరిస్తోంది.

కాగా రీసెంట్‌గా ఆమె నటించిన పెంగ్విన్ చిత్రం ఓటీటీలో రిలీజ్ అయ్యి మంచి విజయాన్ని అందుకుంది. అయితే ప్రస్తుతం సినిమా థియేటర్లు మూతపడటంతో దర్శకనిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేసేందుకు ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. కాగా ఓటీటీలో రిలీజ్ అయిన తొలి పెద్ద సినిమా కీర్తి సురేష్‌దే కావడం విశేషం. ఇక అక్కడి నుండి చాలా సినిమాలను ఓటీటీలో రిలీజ్ చేస్తూ వస్తున్నారు. కానీ పెద్ద సినిమాలు మాత్రం చాలా తక్కువగానే ఓటీటీలో రిలీజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో కీర్తి సురేష్ మాత్రం తన సినిమాలను వరుసగా ఓటీటీలో రిలీజ్ చేస్తూ దూసుకుపోతుంది.

ఇప్పటికే పెంగ్విన్ చిత్రాన్ని రిలీజ్ చేసిన ఈ బ్యూటీ, తన నెక్ట్స్ మూవీ ‘మిస్ ఇండియా’, ‘గుడ్ లక్ సఖీ’లను కూడా ఓటీటీ బాటలో రిలీజ్ చేసేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే ఓటీటీలతో ఒప్పందం చేసుకున్న ఈ సినిమాలను రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు రెడీ అవుతున్నారు. ఎప్పుడో షూటింగ్ పూర్తి చేసుకుని రిలీజ్‌కు నోచుకోని ‘గుడ్ లక్ సఖీ’ చిత్రం కూడా ఇప్పుడు ఓటీటీలో రిలీజ్ అవుతుండటంతో ఓటీటీలో ఎక్కువ సినిమాలు చేసిన బ్యూటీగా కీర్తి సురేష్ నిలిచింది. ఒక విధంగా చెప్పాలంటే ‘ఓటీటీ క్వీన్’గా కీర్తి మారిందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad