బిగ్ బాస్ సీజన్2 విన్నర్ కౌశల్‌పై ఇప్పటి వరకు వచ్చిన ఆరోపణలకు సరైన సమాధానాన్ని ఇవ్వాలని మీడియాకి వచ్చారు. కౌశల్ ఆర్మీకి సంబందించినవారే నాపై ఆరోపణలు చేయడం బాధాకరంగా ఉందంటూ చెప్పారు. అంతే కాకుండా వారు కొంతమందితో కలిసి కుట్ర చేస్తున్నారంటూ.. దమ్ముంటే ఆధారాలతో నిరూపించాలని సవాల్ విసిరాడు.
గురువారం రోజున హైదరాబాద్‌లో ప్రెస్ మీట్ నిర్వహించారు. తాను, తన భార్య నీలిమతో కలిసి ఈ ప్రెస్ మీట్ లో పాల్గొన్నారు. నా వెంటే ఉండి, నా వ్యక్తిత్వం మొత్తం తెలిసి నా గూర్చి ఆరోపణలు చేస్తుంటే జీర్ణించుకోలేక పోతున్నానంటూ ఎంతో ఆవేశంతో, భావోద్వేగంతో సమాధానాలు చెప్పుకొచ్చారు. నేను డబ్బు మనిషినన్నారు, బిగ్ బాస్ హౌస్‌లో విన్నర్ గా నిలిచినపుడు వచ్చిన ప్రైజ్ మనీని దుర్వినియోగం చేశానంటూ లేనిపోని ఆరోపణలు మోపారు. నాకు ప్రైజ్ మనీ 50 లక్షల రూపాయలు క్యాన్సర్ రోగులకు వినియోగిస్తానని మాట ఇచ్చాను. ఇప్పటికే పనులు మొదలయ్యాయి. నా తల్లి క్యాన్యర్ జబ్బుతో మరణించింది. అలా నా తల్లిలా ఎవరికీ కాకూడదనే ఫ్రైజ్ మనీ మొత్తం క్యాన్సర్ రోగులకు వినియోగించుకొనుటకు నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. ఇలా మొత్తం డబ్బులో పన్ను పోగా నా చేతికి 34 లక్షల రూపాయలు మాత్రమే వచ్చాయన్నారు.
డబ్బుని నేను క్యాన్సర్ రోగులకు మాత్రమే వినియోగిస్తున్నాను. అందులో భాగంగా వైజాగ్ వాసి ప్రశాంతి అనే క్యాన్సర్ అమ్మాయిని దత్తత తీసుకుని ట్రీట్మెంట్ చేపిస్తున్నా. ఇప్పటికే 25 వేల రూపాయల చెక్ ఇచ్చాను. ఆ వీడియో ఇప్పటికి నాదగ్గరే ఉంది. ఆమె క్యాన్సర్ నుంచి పూర్తిగా కోలుకునేంతవరకు డబ్బులు నేనే ఖర్చుచేస్తానని ప్రామిస్ చేశాను. అలా ఆమె తర్వాతే మరోకరికి వైద్యం చేపించాలనుకున్న. అంతేకాని క్యాన్సర్ వచ్చిన ప్రతి ఒక్క పేషెంట్ దగ్గరకు వెళ్లి నేను లక్షలు ఇవ్వలేను కదా అన్నారు.
నా తల్లిలాగే, నా భార్యకు కూడా కాన్సర్ ..
నేను బిగ్ బాస్ హౌస్ లో ఉన్నపుడు నా సతీమణి నీలిమి నాకోసం చాలా కష్టపడింది. ఆఖరికి తన ఆరోగ్యాన్ని సైతం పట్టించుకోకుండా, నేను హీరో కావాలనే నా తల్లి కోరిక నెరవేర్చడం కోసం నా సతీమణి కష్టపడుతూనే ఉంది. ఇంకా చెప్పాలంటే నా తల్లికున్నట్లే, నా భార్యకు క్యాన్సర్ ఉందని కన్నీరు కార్చాడు. కడుపులో క్యాన్సర్ కంతి ఉండి నా కోసం ఎంతో కష్టపడుతున్న నీలిమా పై ఆరోపణలు చేయడమెంతవరకు కరెక్ట్ అంటూ వారి మాటల్ని ఖండించారు కౌశల్.
Read also: కౌశల్ ఆర్మీ చాలా పెద్ద చీటర్ ..!