
క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్ దుబాయ్‌లో నిర్వహించేందుకు అన్ని ఏర్పా్ట్లు చేస్తున్నారు. అయితే ఐపీఎల్‌ను ఈ నెల 19 నుండి ప్రారంభిస్తున్నట్లు బీసీసీఐ తెలిపింది. గతంలో ఐపీఎల్ టోర్నీలో రోజుకు ఒక్క మ్యాచ్ జరిగినప్పుడు రాత్రి 8 గంటలకు, రోజుకు రెండు మ్యాచ్‌లు జరిగినప్పుడు సాయంత్రం 4 గంటలకు, రాత్రి 8 గంటలకు మ్యాచ్‌లు మొదలయ్యేవి.
కానీ ఈసారి వాటి సమయాన్ని అరగంట ముందుకు మార్చారు. దీంతో సాయంత్రం 3.30గంటలకు, రాత్రి 7.30 గంటలకు మ్యాచ్‌లను నిర్వహించనున్నట్లు నిర్వాహకులు తెలిపారు. అయితే ఇప్పుడు రాత్రిపూట ప్రసారమయ్యే మ్యాచ్ టైమింగ్‌ను మార్చాలంటూ తెలుగు ప్రేక్షకులు కోరుతున్నారు. ఐపీఎల్‌ను ఆ సమయంలో ప్రసారం చేస్తే, తమ వంటలక్క సీరియల్‌ను మిస్ అవుతామని వారు బాధపడుతున్నారు. స్టార్ మాలో ప్రసారమయ్యే ‘కార్తీక దీపం’ సీరియల్‌కు ఎలాంటి ఫాలోయింగ్ ఉంతో అందరికీ తెలిసిందే.
ఇప్పుడు ఐపీఎల్ కారణంగా తమ అభిమాన సీరియల్‌ను మిస్ అయ్యే ప్రసక్తే లేదని, అందుకే ఐపీఎల్ మ్యాచ్ సమయాన్ని మార్చాలంటూ బీసీసీఐకి తెలుగు ఆడియెన్స్ మొరపెట్టుకుంటున్నారు. ఒక వ్యక్తి ఏకంగా సౌరవ్ గంగూలీకి ఈ విషయంపై ట్వీట్ కూడా చేశాడు. దీంతో ఈ విషయం ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.