Home సినిమా బాలీవుడ్ ని భయపెడుతున్నకాంట్రవర్సీ కంగనా..!

బాలీవుడ్ ని భయపెడుతున్నకాంట్రవర్సీ కంగనా..!

కంగనారనౌత్ బాలీవుడు క్వీన్ నుంచి కాంట్రవర్సీ క్వీన్ గా మారింది. సినిమా సినిమా కు కొత్త కథ సెట్ చేసుకున్నట్టుగా కంగనా ఓ వివాదాన్ని రాజేస్తుంది. రైటర్, హీరో, డైరెక్టర్ అనే తేడా లేకుండా ప్రతి ఒకరితో గిల్లి కజ్జాలు పెట్టుకుంటూ కంగనా వివాదాలకి చిరునామాగా మారింది.

కంగనారనౌత్ ఎక్కడ ఉంటే అక్కడ కాంట్రవర్సీస్ కామన్ అన్నట్టుగా తయారవుతుంది పరిస్థితి. సినిమా సినిమా కో ఓ వివాదాన్ని తీసుకొస్తూ బాలీవుడ్ లో ఎప్పుడు మాటల మంటలు రేపుతూనే ఉంది. సినిమాలు లేకపోయినా  పరవాలేదు,  కాంట్రవర్సీస్ లేకపోతె ఉండలేను అన్నట్లుగా ఎప్పుడు వివాదాలతోనే ప్రయాణం చేస్తుంది. మణికర్ణిక సినిమా విడుదల అయ్యి వారం అఅవుతున్నా, ఇప్పటివరకు ఈ మూవీ కలెక్షన్ల గురించి కానీ, రెస్పాన్స్ గురించి కానీ పెద్దగా ఎవరు మాట్లాడుకోలేదు.

 సోషల్ మీడియా నుంచి బాలీవుడ్ మేన్స్ డ్రీమ్ మీడియా వరకు అంతా కంగనారనౌత్, ఆమె సోదరి రంగోలిరనౌత్ చేస్తున్న వివాదాల వాఖ్యల గురించే మాట్లాడుకుంటున్నారు. మణికర్ణిక సినిమా కంగనానే డైరెక్ట్ చేశానని, మొదట దర్శకత్వ బాధ్యతలు తీసుకున్న క్రిష్ ఏమి చేయలేదని స్టేట్మెంట్ ఇచ్చింది. దానికి బదులుగా క్రిష్ కూడా కౌంటర్ ఇచ్చాడు. ఇద్దరు వాట్స్అప్ సంభాషణలను స్క్రీన్ షాట్ తీసి పెట్టడంతో ఈ గొడవ కాస్త గాలివానగా మారింది. ఈ దుమారంలో పడి సినిమా టాక్ ను కూడా ఎవరు పట్టించుకోవటం లేదు.

కంగనా లిస్ట్ లో హీరోలు

కంగనారనౌత్ వివాదల లిస్ట్ లో హృతిక్ రోషన్ నుంచి సోనమ్ కపూర్ వరకు చాల మంది ఉన్నారు. హృతిక్ తనకు అభ్యంతరకరమైన ఇమెయిల్స్ పంపించాడని కోర్టు వరకు వెళ్లిన కంగనా ఖాతాలో చాలా కాంట్రవర్సీస్ ఉన్నాయి. తాను ఇష్టపడిన వారిని దక్కించుకోవడానికి చేతబడి కూడా చేసిందని విమర్శలు ఉన్నాయి. కంగనా తన ఎక్స్ బాయ్ ఫ్రెండ్ మధ్య సుమన్ తో రిలేషన్ షిప్ లో ఉన్నప్పుడు అతనిని కంట్రోల్లో ఉంచుకోవడానికి చేతబడి చేసిందని ఆరోపణలు వచ్చాయి.

బాలీవుడ్ లో భామ రేపిన భయం 

కంగనారనౌత్ ఇలా తనతో పనిచేసిన ప్రతి ఒకరితో గొడవలు పెట్టుకోవడం వారిని మీడియాకు ఎక్కిస్తుండటంతో బాలీవుడ్ జనాలంతా ఈమెతో సినిమాలనంటే భయపడుతున్నారంటా. ఎంత టాలెంటెడ్ అయినా కాంట్రవర్సీస్ కి కేరాఫ్ అడ్రస్ గా మారుతున్న ఈమెతో పని చేయడానికి చాలా మంది దర్శక నిర్మాతలు ఆసక్తి చూపించటం లేదని తెలుస్తుంది. ఇక ఇలాంటి గొడవలతో కంగనా తన కెరీర్ కు శుభం కార్డు వేసుకుంటుందని మాటలు వినిపిస్తున్నాయి. మరి ఈ క్వీన్ కెరీర్ ఎటు వైపు మరలనుందో చూడాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad