Home సినిమా 1400 మంది డ్యాన్సర్లతో 'కాంచన 3'.. లారెన్స్ అదరగొట్టేస్తున్నాడు..!

1400 మంది డ్యాన్సర్లతో ‘కాంచన 3’.. లారెన్స్ అదరగొట్టేస్తున్నాడు..!

హారర్ థ్రిల్లర్ సినిమాలతో దర్శకుడిగానూ, హీరోగా అభిమానులను ఆకట్టుకోవడంలో, భయపెట్టడంలో రాఘవ లారెన్స్ ని మించిన వారెవరు లేరు. అప్పట్లో లారెన్స్ రూపుదిద్దిన ముని, కాంచన, కాంచన 2 సినిమాలు తెలుగు, తమిళంలోనూ భారీ విజయాన్నీ, వసూళ్లను రాబట్టి హిట్ కొట్టాయి. ఈ పరంగానే హారర్ థ్రిల్లర్ మూవీ గా ‘కాంచన 3’ సినిమాను ఏప్రిల్ 19 న రిలీజ్ చేయనున్నారు లారెన్స్.

కొరియోగ్రాఫర్ గా లారెన్స్ ఏంటో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇప్పటికే హార్రర్ సినిమాలతో సంచలనాలు సృష్టిస్తూ అందరిని మెప్పిస్తున్న లారెన్స్ ‘కాంచన3’ లో ఒక డిఫరెంట్ ప్రాజెక్ట్ చేయబోతున్నాడట. ‘కాంచన 3’ చిత్రంలో 1400 మంది డ్యాన్సర్లతో ఒక సరికొత్త పాట కంపోజ్ చేస్తున్నారు. ఇందులో 400 మంది డ్యాన్సర్స్ అఘోరా గెటప్స్‌లో కనిపించబోతున్నారు.

ఈ పాటషూట్ కోసం ఒక కోటి ముప్పది లక్షల రూపాయలతో భారీ సెట్టింగ్ ఏర్పాటు చేస్తున్నారు. ఈ సినిమాలో ఈ పాటే స్పెషల్ అట్రాక్షన్ అవుతుందన్న మాట. ‘కాంచన3’ ని టాలీవుడ్ , కోలీవుడ్ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా ఒకే సారి విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నారు. తెలుగులో నిర్మాత బి.మధు విడుదల చేయగా, లారెన్స్ సరసన బిగ్బాస్ ఫేమ్ ఓవియా, వేదిక, నటిస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad