Home సినిమా టాలీవుడ్ న్యూస్ కళాతపస్వి విశ్వ‌నాథ్ గారి కెరీర్‌ గ్రాఫ్

కళాతపస్వి విశ్వ‌నాథ్ గారి కెరీర్‌ గ్రాఫ్

k viswanath thumb

మ‌న చిత్ర ప‌రిశ్ర‌మ‌లో ఎంతో మంది ద‌ర్శ‌కులున్నారు. ఒక్కొక్క‌రిదీ ఒక్కో శైలి. ఎవ‌రికి వారే సాటి అన్న‌ట్టుగా సినిమాలు తీస్తుంటారు. కానీ ఒక‌రు మాత్రం చాలా భిన్నంగా ఉంటారు. సినిమా క‌థ‌లో క‌ళాత్మ‌క విలువ‌లు జోడించి సినిమాలు తెర‌కెక్కిస్తుంటారు. ఆయ‌నే క‌ళాత‌పస్వి కె విశ్వ‌నాథ్‌. తాను న‌మ్ముకున్న శైలిలోనే సినిమాలు తీసి ట్రెండ్ సెట్ చేశారు. అంతేకాదు…అవి ఎవ‌ర్ గ్రీన్ గా నిలిచాయి. సౌత్ ఇండియాలోని ప్ర‌తీ న‌టుడు విశ్వ‌నాథ్ సినిమాలో చేయాల‌నుకున్న‌వాళ్లే. క‌థ‌, క‌థ‌న‌మే హీరోగా ఆయ‌న సినిమాల్లో పాత్రలు న‌డుస్తుంటాయి. భార‌త ప్ర‌భుత్వం నుంచి ప‌ద్మ‌శ్రీ పుర‌స్కారం అందుకున్న విశ్వ‌నాథ్ క‌ళాత‌పస్వి అయ్యారు. ఎన్నో జాతీయ అవార్డులు, నంది అవార్డులు…… ఆయ‌న సినిమాలు సొంతం చేసుకున్నాయి. మ‌రే ద‌ర్శ‌కుడు సినిమాలు….ఆ స్థాయిలో అవార్డులు పొంద‌లేదంటే అతిశ‌యోక్తి కాదేమో. పింక్ లాంటి సినిమాలు చూసి ఇప్పుడు ….. కోర్టు సీన్స్ తో కూడిన సినిమాలు తెలుగులో ఎందుకు రావు అనుకుంటారు. ఎప్పుడో 1968లోనే సుడిగుండాల సినిమా చూస్తే …..మ‌న రేంజ్ ఏమిటో తెలుస్తుంది. దీనికి అసిస్టెంట్‌గా కె విశ్వ‌నాథ్ ప‌నిచేశారు. ఇక 1973లో విశ్వ‌నాథ్ తీసిన నేర‌ము శిక్ష మూవీ చూస్తే ……చిన్న చిన్న త‌ప్పులు కార‌ణంగా కొన్ని ఫ్యామిలీలు ఎలా న‌ష్ట‌పోతాయో అర్ధ‌మౌతుంది. ఇక 1974లో ఓ సీత క‌థ‌ను అద్భుతంగా తెర‌కెక్కించారు. తాను కోరుకున్న అమ్మాయి త‌న‌కు త‌ల్లిగా వ‌స్తే….. ప‌డే వ్య‌ధ ఎలా ఉంటుందో చూపించారు. 1976లో వ‌చ్చిన సిరిసిరి మువ్వ మూవీలో …..మూగ‌మ్మాయిగా జ‌య‌ప్ర‌ద‌, ఆమెను అభిమానించే సాంబ‌య్య పాత్ర‌లో చంద్ర‌మోహ‌న్ న‌ట‌న ఎప్ప‌టికీ ఒక అద్భుత‌మే. ఆ స్థాయిలో చేయించుకున్నారు ద‌ర్శ‌కుడు విశ్వ‌నాథ్. ఇక 1978లో వ‌చ్చిన సీతామ‌హాల‌క్ష్మీ కూడా అప్ప‌ట్లో క‌ళాఖండ‌మే అని చెప్పాలి. ఈ సినిమా ద్వారా ఇండ‌స్ట్రీలో క‌ష్టాలు, లొసుగుల‌ను చూపించారు. ఓ సంగీత పండితుణ్ణి ఓ వేశ్య ఇష్ట‌ప‌డ‌డ‌మా అంటే…… నిజంగా ఇది ఆశ్చ‌ర్య‌పోయే అంశం. కానీ అదే ఇతివృత్తంతో శంక‌రాభ‌ర‌ణం సినిమా తీసి సంగీతంలో ఓల‌లాడించారు. పండిత పామూరుల‌ను రంజింప‌జేశారు. స్టార్ హీరో లేకుండా బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ అందించారు. నిరుద్యోగంతో కొట్టుమిట్టాడే యువ‌త‌కు స్ఫూర్తినిచ్చేలా……. 1982లో శుభ‌లేఖ అనే మూవీని తీసుకొచ్చారు. టాలెంట్ ఉంటే ఏ ఉద్యోగం అయినా చేయొచ్చ‌ని, ప్రేమ‌కు కుల‌మ‌తాలు అడ్డురావ‌ని ఈ మూవీ చాటి చెప్పింది.

ఇక ఓ క‌ళాకారుని బాధ‌ను ప్ర‌పంచానికి తెలియ‌జెప్పిన సినిమా సాగ‌ర‌సంగ‌మం. నాట్య‌కారునిగా క‌మ‌ల్ హాస‌న్ న‌ట‌న ఒక ఎత్తు అయితే…. ఈ మూవీలో అంద‌మైన ప్రేమ‌ను జొప్పించ‌డం మ‌రో అద్భుతం. ఇక విశ్వ‌నాథ్ మ‌న‌సులో ఉంచి పుట్టుకొచ్చిన మ‌రో మూవీ స్వాతి ముత్యం. స‌మాజంలో ఒంట‌రి మ‌హిళ ఎదుర్కొనే బాధ , ఆమెకు ఓ అమాయ‌కుడైన వ్య‌క్తి అండ‌గా నిల‌వ‌డాన్ని ఆవిష్క‌రించిన అద్భుత చిత్రం స్వాతిముత్యం. ఈ సినిమాలో క‌మ‌ల్ క‌న్నా రాధికనే ఎక్కువ మార్కులు తెచ్చుకుంది. గేయ ర‌చ‌యిత‌గా సిరివెన్నెల సీతారామ‌శాస్త్రిని పాటల ర‌చ‌యిత‌గా ప‌రిచయం చేస్తూ వ‌చ్చిన సిరివెన్నెల మూవీ కూడా ఒక అద్భుత‌మే. హీరో అంధుడు హీరోయిన్ మూగ. వీళ్లిద్ద‌రి ప్రేమ‌ను అందంగా మ‌లిచిన చిత్ర‌మే సిరివెన్నెల‌. ఇక మ‌న మూలాల‌ను ఎప్ప‌టికీ మ‌రువ‌కూడ‌ద‌ని చాటిచెప్పే చిత్రం శృత‌ల‌య‌లు. మెగాస్టార్ గా మాస్ ఇమేజ్ తో దూసుకుపోతున్న ద‌శ‌లో…… చిరంజీవి హీరోగా చెప్పులు కుట్టే పాత్ర‌ల్లో నటింప‌జేస్తూ తీసిన సినిమా స్వ‌యంకృషి. 1987లో వ‌చ్చిన ఈ సినిమా పిల్ల‌ల‌ను బాధ్య‌త లేకుండా పెంచితే…. జ‌రిగే న‌ష్టాల‌ను చూపించిన సినిమా. ఆ త‌ర్వాత ఏడాది విక్ట‌రీ వెంక‌టేష్‌, భాను ప్రియ జంట‌గా స్వ‌ర్ణ క‌మ‌లం మూవీని రూపొందించారు. ఆ సినిమా ద్వారా క‌ళ‌ను బ‌తికించ‌డం, దాన్ని ప్ర‌పంచానికి చాటి చెప్ప‌డం ఎంత అవ‌స‌ర‌మో ఈ సినిమాలో చూపించారు. విశ్వ‌నాథ్ కెరీర్‌లో నిలిచిపోయే చిత్రాల్లో సూత్ర‌దారులు. 1989లో వ‌చ్చిన ఈ మూవీలో అహింస‌తో విల‌న్‌కి బుద్ధి చెప్పే విధానాన్ని చూపించారు. అక్కినేని నాగేశ్వ‌ర‌రావు , ముర‌ళీమోహ‌న్‌, భానుచంద‌ర్ కీల‌క‌పాత్ర‌లు పోషించారు. ఇక మెగాస్టార్ హీరోగా అప‌ద్భాంధ‌వుడు మూవీలో….. నిస్వార్ధంగా ఎంత‌టి క‌ష్ట‌మైనా భ‌రించ‌డాన్ని చూపించారు. క‌ళ‌కు క‌రుణ కావాలె త‌ప్ప, ఈర్ష్య కాద‌ని చాటిన చిత్రం స్వాతికిర‌ణం. ఇక 1995లో వ‌చ్చిన శుభ‌సంక‌ల్పం మూవీలో న‌టుడిగా కూడా విశ్వ‌నాథ్ ఎంట్రీ ఇచ్చారు. 2010లో వ‌చ్చిన శుభ‌ప్ర‌దం అనే సినిమాతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చారు. అల్ల‌రి న‌రేష్,మంజ‌రి హీరోగా వ‌చ్చిన చిత్రం. ఇదే విశ్వ‌నాథ్ ఆఖ‌రి మూవీ . అప్ప‌ట నుంచి మంచి న‌టుడిగానే కొన‌సాగుతున్నారు. మామూలుగానే ద‌ర్శ‌కుడి అయిన ఆయ‌న‌కు…న‌ట‌న పెద్ద మ్యాట‌ర్ కాద‌నే చెప్పాలి. అందుకే ద‌ర్శ‌కులు ఏ రోల్ ఇచ్చినా అందులో ఒదిగిపోతుంటారు. అప్ప‌టి త‌రాల‌కే కాదు…భ‌విష్య‌త్ త‌రాల‌కు కూడా విశ్వ‌నాథ్ సినిమాలు మార్గ‌ద‌ర్శ‌క‌మ‌ని చెప్పాలి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad