Home సినిమా గాసిప్స్ లేటు వయసులో లేటెస్ట్ ఎంట్రీ ఇస్తోన్న కాజల్

లేటు వయసులో లేటెస్ట్ ఎంట్రీ ఇస్తోన్న కాజల్

Kajal Aggarwal To Enter Malayalam Movies 1

అందాల భామ కాజల్ అగర్వాల్ దశాబ్ద కాలంగా టాలీవుడ్ ప్రేక్షకులను తన అందంతో పాటు అభినయంతోనూ అలరిస్తూ వస్తోంది. ఇప్పటికే ఈ బ్యూటీ దాదాపు అందరు స్టార్ హీరోల సరసన నటించి మంచి పేరును సంపాదించుకుంది. ఇక ఈ బ్యూటీ ప్రస్తుతం చాలా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ వెళ్తోంది. ఈ క్రమంలో కాజల్ తాజాగా మెగాస్టార్ చిరంజీవి నటిస్తున్న ‘ఆచార్య’ ఇప్పటికే దాదాపు సగం షూటింగ్ జరుపుకున్న సంగతి తెలిసిందే.

అయితే తాజాగా అమ్మడు కొత్తగా ఓ ఇండస్ట్రీలో అడుగుపెట్టేందుకు రెడీ అవుతోంది. ఇప్పటికే తమిళంలోనూ స్టార్ హీరోయిన్‌గా ఉన్న కాజల్, అడపాదడపా బాలీవుడ్ చిత్రాల్లో కూడా నటిస్తూ వస్తోంది. అయితే ఇప్పుడు మలయాళంలో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చేందుకు కాజల్ పాప రెడీ అయ్యిందట. అక్కడ వరుస చిత్రాలతో దూసుకుపోతున్న పృథ్వీరాజ్ లేదా ఫహాద్ ఫాజిల్ హీరోగా రాబోయే సినిమాలో కాజల్ హీరోయిన్‌గా నటించనున్నట్లు తెలుస్తోంది.

ఒకవేళ ఈ వార్త నిజం అయితే కాజల్ ఇక దక్షిణాదిన దాదాపు అన్ని భాషల్లో నటించిన బ్యూటీగా మారుతుంది. ఇప్పటికే తెలుగు, తమిళ చిత్రాల్లో అదిరిపోయే ఫాలోయింగ్ ఉన్న ఈ బ్యూటీ మలయాళంలోనూ తనదైన యాక్టింగ్‌ను ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకోవాలని ఆమె ఫ్యాన్స్ కోరుతతున్నారు. మరి ఈ బ్యూటీ నిజంగానే మాలీవుడ్ ఎంట్రీ ఇస్తోందా లేక ఇది కూడా గాసిప్ రాయుళ్ల పనేనా అనేది తెలియాలంటే కాజల్ నోరువిప్పేదాక ఆగాల్సిందే.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad