Home సినిమా అనసూయను రిక్వెస్ట్ చేస్తున్న ఎన్టీఆర్ : అసలు జరుగుతుందా !

అనసూయను రిక్వెస్ట్ చేస్తున్న ఎన్టీఆర్ : అసలు జరుగుతుందా !

Jr-NTR-contacting-Anasuya-Bharadwaj
Jr-NTR-contacting-Anasuya-Bharadwaj

టాలీవుడ్ లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. టెంపర్,నాన్నకు ప్రేమతో, జనతా గ్యారేజ్ వరుస హిట్లతో ఊపు మీదున్న ఎన్టీఆర్, దర్శక ధీరుడు జక్కన్నతో కలిసి ఆర్ఆర్ఆర్ సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రాన్ని ఈ ఏడాది విడుదల చేస్తాం అని మూవీ టీం ప్రకటించినప్పటి ప్రస్తుతం కరోనా లాక్‌డౌన్ కారణంగా వచ్చే యేడాది సమ్మర్‌కు పోస్ట్ పోన్ అయింది.

మరోవైపు ఎన్టీఆర్ రాజమౌళి సినిమా తర్వాత త్రివిక్రమ్, కేజీఎఫ్ ఫేమ్ ప్రశాంత్‌ నీల్‌తో పాటు తమిళ దర్శకుడు అట్లీతో వరుస ప్రాజెక్ట్‌లకు కమిటయ్యాడు. ఇక త్రివిక్రమ్‌తో చేయబోయే సినిమా మరింత ఆలస్యం అయ్యే అవకాశాలున్నాయి. ఆర్ఆర్ఆర్ తరువాత ఎన్టీఆర్ రేంజ్ భారీగా పెరిగే అవకాశం ఉంది. దీనిని దృష్టిలో పోట్టుకొని ఎన్టీఆర్ సరికొత్త ప్రాజెక్టుకు శ్రీకారం చుడుతున్నట్టు తెలుస్తోంది. అయితే ఈ సారి యంగ్ టైగర్ సినిమాలు మీద కాకుండా టెలివిజన్ పై దృష్టి సారిస్తున్నట్లు తెలుస్తోంది.

ఎన్టీఆర్ ఇప్పటికే భార్గవ్ హరి అనే కొత్త ప్రొడక్షన్ హౌస్‌ను తన తండ్రి కొడుకులు పేరు మీదుగా స్టార్ట్ చేశాడు. అయితే సన్నిహితులకు ఇచ్చిన సలహా మేరకు టెలివిజన్ షోస్ లో ఎన్టీఆర్ భారీగా పెట్టుబడులు పెట్టారంట. నాగార్జున,చిరంజీవికి మా టీవీ ఉనట్టు తనకు కూడా ఒక ప్రత్యేకమైన టీవీ ఛానెల్ ఉండాలని తారక్ ఎప్పటి నుంచో అనుకుంటున్నారు. తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం తారక్ తన మామ నార్నే శ్రీనివాస్‌కు చెందిన ఎంటర్టైన్మెంట్ ఛానెల్‌ ను సరిద్ది పూర్తి స్థాయి వినోద భరిత ఛానెల్ గా మార్చుతున్నారు. తారక్ ఇప్పటికే కొంత మందితో ఒక టీమ్‌ను ఏర్పాటు చేసి అందులో సరికొత్త ప్రోగ్రామ్స్‌ను ప్రసారమయ్యేలా చూడమని చెప్పాడట.

ఎంటర్టైన్మెంట్ ఛానెల్ లో యాంకర్స్ చాలా ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. ప్రస్తుతం యాంకరింగ్ రంగంలో అనసూయ దూసుకుపోతుంది. దీనితో తన ఛానెల్‌‌కు సంబంధించిన కొన్ని కీలకమైన బాధ్యతలను అనసూయకు అప్పగించాలనే ఆలోచనలో ఎన్టీఆర్ ఉన్నట్టు తెలుస్తుంది. ఎన్టీఆర్ స్వయంగా ఆమెకు కాల్ చేసి తన ఛానెల్ లో పని చేయవలసిందిగా కోరారని ఇండస్ట్రీలో అనేక మంది అనుకుంటున్నారు. అనసూయతో పాటు తన ఆప్త మిత్రుడైన సుమ మరియు రాజీవ్ కనకాల ఈ ఛానెల్ కు ముఖ్య బాధ్యతులు నిర్వహించనున్నట్టు తెలుస్తుంది. ఈ ఛానెల్ కోసం ఎన్టీఆర్ ఏకంగా రూ. 100 కోట్లకు పైగా పెట్టుబడి పెట్టబోతున్నట్టు సమాచారం. అంతేకాకుండా ఈ ఛానెల్ లో అప్పుడప్పుడు ఎన్టీఆర్ కూడా ప్రత్యేక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఉంది. ఇదేగాని జరిగితే నందమూరి అభిమానులకు ప్రతి రోజు పండగే. త్వరలోనే దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad