
టాలీవుడ్లో నందమూరి ఫ్యామిలీ నుండి వచ్చిన యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఎలాంటి స్టేటస్‌ను అందుకన్నాడో అందరికీ తెలిసిందే. కాగా ఈ హీరో ప్రస్తుతం టాలీవుడ్లో తరకెక్కుతున్న చిత్రం ‘ఆర్ఆర్ఆర్’లో నటిస్తోన్న సంగతి తెలిసిందే. అయితే ఇప్పటికే యంగ్ హీరోల్లో తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న తారక్, తన నెక్ట్స్ చిత్రాలపై ఫోకస్ పెట్టాడు. కాగ టాలీవుడ్లో స్టార్ హీరోల బంధువులు కూడా తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు.
ఇప్పటికే మహేష్ బాబుకి సుధీర్ బాబు, చరణ్‌కి కళ్యణ్ దేవ్, వరుణ్ తేజ్‌కు రాబోయే బావ చైతన్య లాంటి వారు హీరోలుగా మారి టాలీవుడ్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. కాగా ఇప్పుడు యంగ్ టైగర్ ఎన్టీఆర్ బావమరిది కొడుకు కూడా ఇదే దారిలో టాలీవుడ్ సినిమాల్లో ఎంట్రి ఇచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఆయన హీరోగా కాకుండా టెక్నికల్ పరంగా సినిమాల్లో ఎంట్రీ ఇస్తున్నట్లు ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఏదేమైనా టాలీవుడ్లో ఉన్న స్టార్ యాక్టర్స్ బంధువులు తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నారు. మరి తరాక్ బావమరిది టాలీవుడ్లో ఎలంటి క్రేజీ ప్రాజెక్ట్‌తో వస్తాడా అనే ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఇక తారక్ తాజా చిత్రం ఆర్ఆర్ఆర్ ఇప్పటికే మెజారిటీ షూటింగ్ ముగించుకోగా, త్వరలోనే ఈ సినిమాను రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది. అటు ఈ సినిమా రిలీజ్ కాకముందే తారక్ తన నెక్ట్స్ మూవీని మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ డైరెక్షన్లో తెరకెక్కించేందుకు రెడీ అయ్యాడు.