Home సినిమా ఒక కంటిలో రౌద్రం.. మ‌రో కంటిలో క‌రుణ‌తో రాజారెడ్డి..!

ఒక కంటిలో రౌద్రం.. మ‌రో కంటిలో క‌రుణ‌తో రాజారెడ్డి..!

ఇటీవ‌ల కాలంలో టాలీవుడ్‌లో బ‌యోపిక్‌ల ప‌రంప‌ర కొన‌సాగుతోంది. అల‌నాటి న‌టి సావిత్రి జీవిత క‌థ ఆధారంగా తెర‌కెక్కిన మ‌హాన‌టి చిత్రంతో మొద‌లైన ఈ బ‌యోపిక్‌ల చిత్రీక‌ర‌ణ, ఆ త‌రువాత దివంగ‌త ముఖ్య‌మంత్రులు ఎన్టీఆర్‌, వైఎస్ఆర్, ఉయ్యాల‌వాడ న‌ర్సింహారెడ్డి వంటి ప్ర‌ముఖుల జీవిత క‌థ‌ల‌ను ఆధారంగా చేసుకుని చిత్రాలు తెర‌కెక్కుతున్నాయి.

అయితే, ఇటీవ‌ల ఎన్టీఆర్ బ‌యోపిక్‌కు సంబంధించి ఆ చిత్ర బృందం హైద‌రాబాద్ న‌గ‌రంలో ఆడియో వేడుక‌ల‌ను ఎంతో వేడుక‌గా నిర్వ‌హించిన సంగ‌తి తెలిసిందే. ఆ ఆడియో వేడుక‌లో మ‌హాన‌టుడు ఎన్టీఆర్ కుటుంబ స‌భ్యులంతా క‌లిసి సంద‌డి చేసి, ఎన్టీఆర్ గురించి ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను వెల్ల‌డించారు. ఈ చిత్రం ఈ నెల 9న రిలీజ్ చేయ‌నున్న క్ర‌మంలో ప్ర‌మోష‌న్ కార్య‌క్ర‌మాల‌ను చిత్ర బృందం వేగంతం చేసింది.

ఇక దివంగ‌త సీఎం వైఎస్ఆర్ జీవిత ఆధారంగా తెర‌కెక్కుతున్న చిత్రం యాత్ర‌. డిసెంబ‌ర్ 21న వైఎస్ జ‌గ‌న్ పుట్టిన రోజు సంద‌ర్భంగా యాత్ర టీజ‌ర్‌ను చిత్ర బృందం విడుద‌ల చేసింది. మంగ‌ళ‌వారం నాడు కోట‌లో కొలువయ్యే రేడు అనే రెండో పాట‌ను కూడా రిలీజ్ చేసింది. ఫిబ్ర‌వ‌రి 8న యాత్ర‌ను రిలీజ్‌చేసేందుకు చిత్ర బృందం స‌న్నాహాలు చేస్తోంది.

ఇక అస‌లు విష‌యానికొస్తే, యాత్ర సినిమాలో వైఎస్ రాజ‌శేఖ‌ర్‌రెడ్డి తండ్రి రాజారెడ్డి పాత్ర పోషిస్తున్న న‌టుడు జ‌గ‌ప‌తిబాబుకు సంబంధించి ఫ‌స్ట్ లుక్‌ను ఇవాళ చిత్ర బృందం విడుద‌ల చేసింది. ఈ లుక్‌లో జ‌గ‌ప‌తి బాబు మొఖంలో క‌రుణ‌, రౌద్రం రెండూ ఒకేసారి చూపించాడు. అలాగే ఎడ‌మ చేతికి టైటానిక్ వాచ్‌, కుడి చేతికి ఒక గోల్డ్ రింగ్‌, జేబులో గోల్డ్ క‌ల‌ర్ పెన్‌, వైట్ ష‌ర్ట్‌, కోర మీసం ఇలా ఒక్క లుక్‌లోనే రాజారెడ్డి వ్య‌క్తిత్వాన్ని పూర్తిగా వివ‌రించింది చిత్ర బృందం.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad