
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’ ఇప్పటికే షూటింగ్‌ను ప్రారంభించుకున్న సంగతి తెలిసిందే. అయితే లాక్డౌన్ కారణంగా ఈ సినిమా షూటింగ్ వాయిదా పడింది. టాలీవుడ్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో ఈ సినిమా వస్తుండటంతో ప్రేక్షకుల్లో ఈ సినిమాపై అదిరిపోయే అంచనాలు క్రియేట్ అయ్యాయి. ఇక ఈ సినిమాతో మరోసారి బాక్సాఫీస్‌ను షేక్ చేసేందుకు బన్నీ రెడీ అవుతున్నాడు.
అయితే ఈ సినిమా కథ విషయంలో రచయిత వేంపల్లి గంగాధర్ రైటర్స్ ఆసోసియేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ కథ ‘తమిళ కూలి’ పేరిట సాక్షి పేపర్లో వచ్చిందని ఆయన తెలిపాడు. తన కథను చదివి ఇన్స్పైర్ అయిన సుకుమార్ ‘పుష్ప’ కథను తయారు చేశారని ఆరోపణలు చేసారు. అయితే ఈ ఆరోపణలను చిత్ర యూనిట్ కొట్టిపారేసింది. ఈ సినిమా కథను సుకుమార్ సొంతంగా రెడీ చేశాడని, ఎక్కడి నుండి కాపీ కొట్టాల్సిన అవసరం ఆయనకు లేదని వారు తెలిపారు.
ఇలాంటి ఆరోపణలు చిత్రసీమలో కామన్ అయిపోయాయి. ఇటీవల ఆచార్య సినిమాలోనూ కథను కాపీ చేశారంటూ ఓ రచయిత వివాదం క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ విషయంపై చిత్ర యూనిట్ ఇంకా అఫీషియల్‌గా ఎలాంటి ప్రకటన చేయలేదు. ఇక ఈ సినిమాలో కన్నడ కుట్టి రష్మిక మందన హీరోయిన్గా నటిస్తోన్న సంగతి తెలిసిందే.