Home టాప్ స్టోరీస్ దిగ్గజ దర్శకులు ట్రాప్ లో పడ్డారు

దిగ్గజ దర్శకులు ట్రాప్ లో పడ్డారు

South Indian Movies 2020 Horizontal image with text  1200 x 630 100

బాహుబలి భారీ విజయం తర్వాత ఆ స్థాయి సినిమాలను అందుకోవాలని అనేక మంది దర్శకులు ప్యాన్  ఇండియా సినిమాలకు శ్రీకారం చుట్టారు. తమిళంలో విజయ్ ‘పులి, కన్నడంలో ‘కురు క్షేత్ర’ మళయాళంలో ‘మామలాంగం ‘ పొట్టి భార్య సినిమాలు విడుదలయ్యాయి అయితే ఇవి సక్సెస్ ను  అందుకోలేక ప్రొడ్యూసర్ కు నష్టాలను మిగిల్చాయి.

ప్రస్తుత వాతావరణం భారీ సినిమాలకు అనుకూలంగా లేదని తెలుస్తోంది. కరోనా కారణంగా థియేటర్లు మూత పడటం.. ఆ తర్వాత ప్రేక్షకులు వస్తారో లేదో అన్న సందిగ్ధ పరిస్థితి ఏర్పడడంతో భారీ సినిమాలు డైలమాలో పడ్డాయి. ఇప్పటికీ తెలుగులో తెరకెక్కుతున్నఆర్ఆర్ఆర్ షూటింగ్ నిలిచిపోయింది. వాస్తవానికి బాహుబలి తర్వాత  రాజమౌళి చిన్న చిత్రం చేద్దాం అనుకున్నారు. గతంలో మగ ధీర ‘ తర్వాత ప్రేక్షకుల అంచనాలు అందుకోవడం కష్టమవుతుందని ‘మర్యాద రామన్న’, ‘ఈగ ’ లాంటి సినిమాలు చేశారు. ఈసారి మాత్రం ‘బాహు బలి ’ తర్వాత ఆర్ఆర్ఆర్ లాంటి భారీ ప్రాజెక్ ఎత్తుకున్నారు. ఇప్పుడు ఈ సినిమాలకు విజయం తప్పనిసరి. ఈ సినిమాలు విడుదల అవ్వాలంటే దియేటర్లు తెరుచుకోవాలి, వారి కలెక్షన్లకు సరైన సీజన్ కావాలి.

ఇక గుణశేఖర్ ” హిరణ్య కశ్యప “ సినిమా ఉండనే ఉంది.ఇప్పుడున్న పరిస్థితుల్లో ఇంత పెద్ద బడ్జెట్ వర్కవుట్ కావడం కష్ట సాధ్యమని వాయిదా పడినట్లు తెలుస్తోంది. కన్నడం లో KGF2 విషయానికొస్తే సంజయ్ దత్ తీవ్ర అనారోగ్యం కారణంగా ఎప్పుడు పూర్తవుతుందో తెలియని పరిస్థితి. ప్రభాస్ ‘రాధే శ్యామ్’ సినిమా కూడా పాన్ ఇండియా సినిమానే. కరోనా వల్ల విదేశాలలో ఇప్పుడే షూటింగ్ చేయలేని పరిస్థితులు. ఇవే సమస్యలు చిన్న సినిమాలకి ఉన్నప్పటికీ ఈ భారీ సినిమాల అంచనాలు ఎక్కువ కావడంతో భారతీయ సినిమా పరిశ్రమ భయపడుతోంది. కరోనా వచ్చి భారీ సినిమాలకు ఓ హెచ్చరిక చేసిందా అనిపిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో భారీ సినిమాలు నిర్మిస్తే కష్టాలు రావడం ఖాయమని నిర్మాతల్లో ఒక రకమైన అభిప్రాయం ఏర్పడి ఉంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad