
గోవా బ్యూటీ ఇలియానా గురించి తెలుగు ప్రేక్షకులకు కొత్తగా పరిచయం అవసరం లేదు. దేవదాసు చిత్రంతో అదిరిపోయే ఎంట్రీ ఇచ్చిన ఈ గోవా బ్యూటీ, పోకిరి చిత్రంతో ఒక్కసారిగా లైమ్‌లైట్‌లోకి వచ్చేసింది. ఆ తరువాత తెలుగునాట వెనక్కి తిరిగి చూసుకోలేదు ఈ బ్యూటీ. అయితే కాలక్రమంలో ఆమె బాలీవుడ్ వైపు అడుగులు వేస్తూ, అక్కడ మంచి ఆఫర్లు రావడంతో, టాలీవుడ్ చిత్రాలకు పూర్తిగా దూరం అయ్యింది.
ఇక ఇటీవల తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ తరువాత ఇలియానా కొంత గ్యాప్ తీసుకుని తిరిగి సినిమాలపై దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ఆమె రవితేజ సరసన ‘అమర్ అక్బర్ ఆంథోని’ అనే సినిమాలో నటించింది. కానీ ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలవడంతో ఇలియానాకు మళ్లీ ఆఫర్లు రాలేదు. కాగా ఇప్పుడు ఆమె మళ్లీ బాలీవుడ్‌వైపు చూస్తోంది. ఈ క్రమంలోనే బాలీవుడ్లో తెరకెక్కనున్న ఓ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఇల్లీ బేబీ ఓకే చెప్పిందట.
బాలీవుడ్ హీరో అజయ్ దేవ్గన్ లీడ్ రోల్లో తెరకెక్కనున్న ఈ వెబ్ సిరీస్‌లో నటించేందుకు ఇలియానా ఓకే చెప్పినట్లు తెలుస్తోంది. మొత్తానికి సినిమా అవకాశాలు లేకపోవడంతో ఇలియానా ఈ విధంగా వెబ్ సిరీస్‌లవైపు అడుగులు వేస్తుందని ఆమె ఫ్యాన్స్ అంటున్నారు. ఇప్పటికైనా ఆమెకు సినిమా అవకాశాలు వస్తాయని వారు ఆశిస్తున్నారు.