Home సినిమా సౌత్ అంటేనే దండం పెట్టి పారిపోతున్న గోవా బ్యూటీ!

సౌత్ అంటేనే దండం పెట్టి పారిపోతున్న గోవా బ్యూటీ!

jpg 1

మహేష్ బాబు నటించిన ‘పోకిరి’ చిత్రంతో ఒక్కసారిగా ఓవర్‌నైట్ స్టార్ హీరోయిన్‌గా గోవా బ్యూటీ ఇలియానా తనదైన మార్క్ వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఇచ్చిన బూస్ట్‌తో వరుసబెట్టి సినిమాలు చేసిన ఇలియానా, ఆ తరువాత బాలీవుడ్‌లో సినిమా ఛాన్సులు రావడంతో తెలుగు, తమిళ ఇండస్ట్రీలకు గుడ్‌బై చెప్పేసింది. కేవలం బాలీవుడ్ చిత్రాలపైనే ఫోకస్ పెట్టిన ఈ బ్యూటీ, అక్కడ కూడా ఎక్కువకాలం నొలదొక్కుకోలేకపోయింది. అటు బాయ్‌ఫ్రెండ్‌తో రిలేషన్ మెయింటెయిన్ చేస్తూ వచ్చిన ఈ బ్యూటీ, పెళ్లి కూడా చేసుకున్నట్లు వార్తలు వచ్చాయి.

కానీ అవేమీ నిజం కాదని, తన బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చెప్పేసిన ఇలియానా, ఇప్పుడు మళ్లీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే తెలుగులో ఒకట్రెండు సినిమాల్లో ఛాన్సులు వచ్చినా అవి ఆమెకు ఏమాత్రం ఉపయోగ పడలేదు. ఇక తమిళంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. దీంతో విసిగిపోయిన ఇలియానా, ఇప్పుడు సౌత్‌లో సినిమాలు చేయాలంటేనే ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తుంది. తనకు తెలుగు, తమిళ సినిమాల్లో రీఎంట్రీ ఇవ్వాలనే ఆసక్తి లేదని ఇలియానా అంటోంది. కేవలం బాలీవుడ్, పాన్ ఇండియా చిత్రాలకే తాను ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది.

మొత్తానికి సౌత్ నుండి బాలీవుడ్‌కు వెళ్లిన ఇల్లీ పాప, ఇప్పుడు సౌత్ అంటేనే దండం పెడుతుండటంతో ఇక్కడి జనాలు ఆమె సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు. అటు బాలీవుడ్‌లోనూ సరైన సినిమాలు పడకపోవడంతో ఇలియానా రీఎంట్రీ ఇప్పుడు ప్రశ్నార్ధకంగా మారింది. మరి ఈ బ్యూటీ, బాలీవుడ్‌లో ఎలాంటి సినిమాతో రీఎంట్రీ ఇస్తుందో చూడాలి అంటున్నారు సినీ క్రిటిక్స్.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad