Home సినిమా టాలీవుడ్ న్యూస్ తెలుగులో ఎంట్రీ ఇచ్చి తెలుగే వద్దంటున్న బ్యూటీ!

తెలుగులో ఎంట్రీ ఇచ్చి తెలుగే వద్దంటున్న బ్యూటీ!

Ileana Not Interested In Telugu But Will Do Tamil Movies

టాలీవుడ్‌లో హీరోయిన్‌గా దేవదాస్ సినిమాలో ఎంట్రీ ఇచ్చిన గోవా బ్యూటీ ఇలియానా, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. ఇక టాలీవుడ్‌లో స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈ బ్యూటీ ఆ తరువాత తమిళంతో పాటు బాలీవుడ్‌లోనూ సినిమాలు చేస్తూ దూసుకుపోయింది. అయితే బాలీవుడ్‌లో అదిరిపోయే ఆఫర్లు వస్తుండటం, అమ్మడికి అక్కడ మంచి గుర్తింపు రావడంతో బాలీవుడ్‌లోనే సెటిల్ అయిపోయింది.

ఈ క్రమంలో తెలుగు, తమిళ సినిమాలకు పూర్తిగా గుడ్‌బై చెప్పేసింది ఈ బ్యూటీ. కాగా తన బాయ్‌ఫ్రెండ్‌తో ప్రేమ, పెళ్లి వంటి వ్యక్తిగత కారణాలతో కొంతకాలం సినిమాలకు దూరంగా ఉండిపోయింది. ఇప్పుడు తిరిగి సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ఇల్లీ పాప చాలా కష్టపడుతోంది. బాయ్‌ఫ్రెండ్‌తో బ్రేకప్ చెప్పి ఇప్పుడు సినిమాలపై పడింది ఈ బ్యూటీ. అయితే తెలుగులో రవితేజ సరసన ‘‘అమర్ అక్బర్ ఆంథోని’’ అనే సినిమాలో నటించింది. కానీ ఈ సినిమా ప్రేక్షకులను మెప్పించడంలో పూర్తిగా ఫెయిల్ కావడంతో అమ్మడు టాలీవుడ్‌లో సినిమా చేయాలని అనుకోవడం లేదట.

దీంతో తమిళంలో సినిమాలు చేసేందుకు ఇల్లీ పాప ఆసక్తిగానే ఉన్నా, తెలుగులో మాత్రం సినిమాలు చేయనంటూ తెగేసి చెబుతోంది. తమిళంలో ఏదైనా క్రేజీ ప్రాజెక్ట్ చేయాలని ఉందంటూ ఆమె దర్శకనిర్మాతలకు క్లూ ఇచ్చింది. మరి ఇలియానాకు తమిళంలో రీఎంట్రీ ఇచ్చే ఛాన్స్‌ను ఎవరు ఇస్తారా అనేది ప్రస్తుతం టాక్ ఆఫ్ ది టౌన్‌గా మారింది. అయితే ఫేడవుట్ అయిన ఇలియానాను తీసుకుని చేతులు కాల్చుకునేందుకు తమిళ నిర్మాతలు రెడీగా లేరని కోలీవుడ్ వర్గాలు అంటున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad