Home Latest News ఒక అమ్మాయి మరో అమ్మాయిని ప్రేమిస్తే.!

ఒక అమ్మాయి మరో అమ్మాయిని ప్రేమిస్తే.!

ఓ అమ్మాయి మరో అమ్మాయి ప్రేమలో పడితె ఎలా ఉంటుంది. అనే కోణంలో రూపొందించిన చిత్రం ఏక్ లడ్కీ కో దేఖాతో ఐసా లగా. ఈ రోజుల్లో జరుగుతున్న వాటిని కొన్నింటిని దృష్టిలో పెట్టుకొని ఈ చిత్రాన్ని షెల్లీ చోప్రా ధార్ దర్శకత్వం వహించగా, త్రి ఇడియట్, పీకే, సంజూ లాంటి చిత్రాలను రూపొందించిన విదు వినోద్ చోప్రా నిర్మించిన ఈ సినిమాలో అనిల్ కపూర్, జుహీచావ్లా, సోనమ్ కపూర్, రెజీనా కసండ్రా, రాజ్ కుమార్ రావు ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాని ఫిబ్రవరి 1 న విడుదల చేశారు.

సినిమా కథ లోకి వస్తే..

పంజాబ్ లో సాంప్రదాయ కుటుంబానికి సంబందించిన అనిల్ కపూర్ ఒక వ్యాపారవేత్తగా కనిపించాడు. ఇతని కూతురుగా స్వీటీ చౌదరి పాత్రలో సోనమ్ కపూర్ నటించింది. చిన్ననాటినుండి అమ్మాయిలంటే మక్కువగా ఉండే పాత్రలో నటించింది. సోనమ్ కపూర్ చిన్నపుడే ఒక స్నేహితురాలి ప్రేమని పొందడంలో షాక్ కి గురవుతుంది. అప్పటి నుండి ప్రేమ కోసం తపిస్తున్ తనకు ఎన్నారై కి చెందిన కుహు (రెజీనా కసండ్రా) తో స్నేహం కుదురుతుంది.

ఈ సమయంలో ఓ సినీ నిర్మాత కొడుకైన సాహిల్ మీర్జా( రాజ్ కుమార్) ముస్లిం తో సోనమ్ కు పరిచయం ఏర్పడుతుంది. ఇతను నాటకాలు పిచ్చితో సినీ రంగాన్ని వదిలేస్తాడు.నాటకాలకు దర్శకత్వం వహిస్తున్న సాహిల్ తో స్వీటీ తనకున్న సమస్యను పంచుకుంటుంది. దీంతో చిత్రం కొత్త మలుపు తిరుగుతుంది. సాంప్రదాయ కుటుంబానికి చెందిన సోనమ్, ముస్లిం మతస్థుడైన మీర్జాతో ప్రేమలో పడిందని కుటుంబమంతా భావిస్తుంటారు. ఈ కోణంలో కొనసాగుతున్న సినిమాలో మీర్జా మాత్రం కుహు, స్వీటీ లను కలిపే దిశగా ప్లాన్ వేస్తాడు.

సమాజ కట్టుబాట్లకు విరుద్దంగా సాగే ఈ కథలో వారిద్దరూ కలుస్తారా? కుహు, స్వీటీని కలపడానికి సాహిల్ మీర్జా ఏం చేస్తాడు? చివరకు వారి ప్రేమా గెలుస్తుందా అనేది తెర పైనే చూడాలి. అనిల్ కపూర్ తన కూతురు స్వలింగ ప్రేమ గూర్చి తెలిసి ఎలా స్పందిస్తారో కళ్ళకు కట్టినట్లు చూపించారు. ఇక జూహీ చావ్లా విషయానికొస్తే అనిల్ కపూర్ కి జంటగా నటించింది. అనిల్ కపూర్ నుండి విడాకులు తీసుకొని ఒంటరిగా బ్రతుకుతూ, నటన అంటే పిచ్చి ఉన్నపాత్రలో పోషించారు. వీరిద్దరూ కూతురుకున్న సమస్య తెలిసి ఎలా ఇబ్బంది పడ్డారో వైవిద్యాస్పదంగా నటించారు. అనిల్, జూహీ ఎదురైనపుడు జరిగే హాస్యాస్పదమైన సన్నివేశాలు ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి.

నటీనటులు : అనిల్ కపూర్, జుహీ చావ్లా, సోనమ్ కపూర్, రాజ్‌కుమార్ రావు, రెజీనా కసండ్రా 
ప్రొడక్షన్ : విధు చోప్రా
ప్రొడ్యూసర్ : విధు వినోద్ చోప్రా
కథ, దర్శకత్వం : షెల్లీ చోప్రా ధార్
మ్యూజిక్‌  : రోచక్ కోహ్లీ
సినిమాటోగ్రఫి : హిమాన్ ధమిజా
ఎడిటింగ్ : అశీష్ సూర్యవంశీ

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad