Home Latest News వైసీపీలో చేరిక‌పై హైప‌ర్ ఆది క్లారిటీ..!

వైసీపీలో చేరిక‌పై హైప‌ర్ ఆది క్లారిటీ..!

క‌డుపుబ్బా న‌వ్వించే కామెడీ పంచ్‌ల‌కు కేరాఫ్ అడ్ర‌స్ హైప‌ర్ ఆది అన్న సంగ‌తి ప్ర‌తీ ఒక్క‌రికీ తెలిసిందే. బుల్లితెర‌పై ప్ర‌సార‌మ‌య్యే జ‌బ‌ర్ద‌స్త్ కామెడీ షోతో ఎంట్రీ ఇచ్చి, ఆపై స్కిట్స్‌లో త‌న‌కంటూ ప్ర‌త్యేకత‌ను చాటుకుంటూ అతి త‌క్కువ కాలంలోనే స్టార్ క‌మెడియ‌న్ స్థాయి గుర్తింపును పొందాడు. హైప‌ర్ ఆది ప్ర‌స్తుతం టాలీవుడ్ ప‌వ‌ర్ స్టార్ ప‌వ‌న్ క‌ళ్యాణ్ స్థాపించిన జ‌న‌సేన పార్టీలో ప్ర‌ముఖ పాత్ర‌ను పోషిస్తున్నారు.

ఇదిలా ఉండ‌గా, ఇటీవ‌ల ఓ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో హైప‌ర్ ఆది ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల‌ను చెప్పుకొచ్చారు. తాను వైసీపీలో చేర‌బోతున్న‌ట్టు గ‌తంలో సోష‌ల్ మీడియాలో వెలువ‌డిన పోస్టులపై స్పందించారు.అంతేకాకుండా, ఆ క‌థ‌నాలు వెలువ‌డేందుకుగ‌ల‌ ప్ర‌ధాన కార‌ణాన్ని కూడా హైప‌ర్ ఆది చెప్పారు.

తాను చేసిన ఓ స్కిట్‌లో ఉప్పుక‌ప్పురంబు.. బీకామ్‌లో ఫిజిక్స్ ఉండు అంటూ ఓ లైన్‌ను వాడాన‌ని, ఆ లైన్ టీడీపీకి నెగిటివ్‌గా ఉంద‌ని, ఆ లైన్ రాసింది కూడా హైప‌ర్ ఆదినే కాబ‌ట్టి, హైప‌ర్ ఆది టీడీపీకి వ్య‌తిరేక‌మ‌ని, ఆ క్ర‌మంలోనే ఇక మిగిలింది వైసీపీనే గ‌నుక వైసీపీలోకి చేరేందుకు హైప‌ర్ ఆది అంతా రెడీ చేసుకున్నాడు… ఒంగోలు నుంచి వైసీపీ ఎమ్మెల్యేగా హైప‌ర్ ఆది పోటీ… వెనుక ఉండి చ‌క్రం తిప్పుతున్న రోజా అంటూ హెడ్డింగ్‌లు పెట్టి క‌థ‌నాలు ప్ర‌చురించారని, ఆ క‌థ‌నాల‌న్నీ వ‌ట్టి పుకార్లేన‌ని హైప‌ర్ ఆది స్ప‌ష్టం చేశాడు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad