Home సినిమా ‘ఆర్ ఎక్స్ 100' హీరో : గోల.. వేసే వేశాలన్నీ వైరల్..!

‘ఆర్ ఎక్స్ 100′ హీరో : గోల.. వేసే వేశాలన్నీ వైరల్..!

‘ఆర్ ఎక్స్ 100’ సినిమాతో యూత్ లో క్రేజ్ కొట్టేసిన కార్తికేయ టీఎన్ సంతోష్ దర్శకత్వం వహిస్తున్న ‘హిప్పీ’ సినిమాలో నటిస్తున్నాడు. లవ్ రొమాంటిక్ ఎంటర్టైన్మెంట్ గా సాగే సినిమాను వి క్రియేషన్స్ ఏషియన్ సినిమాస్ బ్యానర్ మీద కలైపులి థాను నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. కార్తికేయ సరసన దిగంగాన నటిస్తుంది. ఒక కీలకమైన పాత్రలో జేడీ చక్రవర్తి నటిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ట్రైలర్, లిరికల్ వీడియో సాంగ్ కి మంచి రెస్పాన్స్ వచ్చింది. లవ్, యాక్షన్, ఎమోషన్, రొమాన్స్ లను మేళవించిన సినిమా నుంచి ‘వైరల్ వైరల్..’ అంటూ కొనసాగే సాంగ్ ని విడుదల చేశారు.

“వైరల్… మన గోల వైరల్.. మనమంతా వేసే వేశాలన్నీ వైరల్.. మన గోల వైరల్.. మనమంతా చేసే మొత్తం రచ్చ వైరల్ వైరల్…” అంటూ కొనసాగే పాటను అనంత్ శ్రీరామ్ సాహిత్యాన్ని, బాల మురళి బాలు సంగీతాన్ని అందించగా రఘు దీక్షిత్, విష్ణుప్రియ రవి, క్రిస్టోఫర్ ఆలపించిన పాట యూత్ ని ఆకట్టుకుంటూ వైరల్ అవుతుంది. అతి త్వరలోనే తెలుగు తమిళ భాషల్లో విడుదల చేయుటకు సన్నాహాలు చేస్తున్నారు.

Viral Song Full Lyrical | HIPPI Movie Songs | Kartikeya | Digangana | Raghu Dixit | Balamurali Balu

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad