
టాలీవుడ్లో వరుస సినిమాలు చేస్తున్న యంగ్ హీరోల్లో బెల్లంకొండ శ్రీనివాస్, సక్సెస్ మాత్రం అనుకున్న స్థాయిలో కొట్టలేకపోయాడు. దీంతో ఆయన చేసిన చాలా సినిమాలు బాక్సాఫీస్ వద్ద యావరేజ్ సినిమాలుగా నిలిచాయి. అయితే ఈ హీరో సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిచానా ఎత్తేసినా కూడా ఆయన సినిమాల్లో ఎక్కువగా స్టార్ హీరోయిన్లే దర్శనమిస్తూ వచ్చారు. దీనికి ఓ బలమైన కారణం ఉందనే విషయం అందరికీ తెలిసిందే.
స్టార్ హీరోల చిత్రాల్లో నటించే టాప్ హీరోయిన్లు వరుసబెట్టి సినిమాలు చేస్తూ భారీ పారితోషకం తీసుకుంటూ ఉంటారు. కానీ బెల్లంకొండ బాబు సినిమాల్లో ఎక్కువగా నటించేది స్టార్ హీరోయిన్లే. ఈ విషయంలో వారు చెబుతున్న కారణాలు వింటే మనం కూడా ఆ హీరోయిన్లకే సపోర్ట్ ఇస్తాం. తెలుగులో హీరోయిన్లు తీసుకునే సాధారణ రెమ్యునరేషన్ కంటే ఎక్కువ మొత్తంలో అంటే డబుల్ రేటు ఇచ్చి మరీ తన సినిమాల్లో స్టార్ హీరోయిన్లను తీసుకుంటున్నాడు ఈ బెల్లంకొండ బాబు. ఇలాంటి అలవాటు మన హీరో ఒక్కడిదే కాదు. అటు తమిళ హీరో విశాల్ కూడా ఉందని చాలా తక్కువ మందికి తెలుసు.
తెలుగులో బెల్లంకొండ బాబు చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆడకపోయినా దర్శకనిర్మాతలు, స్టార్ హీరోయిన్లు తమకు ఎక్కువ రెమ్యునరేషన్ వస్తుందనే కారణంగానే ఆయన సినిమాలు చేస్తున్నారనేది వాస్తవం. అటు తమిళ హీరో విశాల్ సినిమాల పరిస్థితి కూడా ఇదే. ఆయన చేస్తున్న సినిమాలు బాక్సాఫీస్ వద్ద పెద్దగా ఆకట్టుకోకపోయినా ఆయన సినిమాల్లో స్టార్ హీరోయిన్లు నటిస్తూ వస్తున్నారు. ఏదేమైనా ఇలా ఫ్లాప్ హీరోల సరసన స్టార్ హీరోయిన్లు వరుసబెట్టి సినిమాలు చేస్తుండటంతో మిగతా హీరోయిన్లు అవాక్కవుతున్నారు.