Home టాప్ స్టోరీస్ ఫ్రంట్లైన్ వారియర్స్ కి అండగా సూర్య:గొప్ప మనసు

ఫ్రంట్లైన్ వారియర్స్ కి అండగా సూర్య:గొప్ప మనసు

jpg

తమిళ్ హీరో సూర్య మరోసారి తన దాతృత్వాన్ని చాటుకున్నారు. కరోనా బారిన పడకుండా సమాజానికి 24 గంటలు సేవలు చేస్తున్న ఫ్రంట్లైన్ వారియర్స్ కి సూర్య అండగా నిలిచారు. ముఖ్యంగా వైద్యులు, ఆస్పత్రి సిబ్బంది, పోలీసులు, పారిశుద్ధ్య శాఖ కార్మికులు, ప్రజలకు సేవలు అందిస్తున్నా స్వచ్ఛంద సంస్థలు మరియు అభిమాన సంఘాలకు ఆర్థిక సాయం అందిస్తున్నట్లు సూర్య పత్రిక ప్రకటనలో పేర్కొన్నారు.  తాజాగా సూర్య నటించిన సూరరై పోట్రు చిత్రం ఓటీటీ ప్లాట్‌ఫాంలో విడుదలవుతున్న విషయం తెలిసిందే. ఈ చిత్రాన్ని విక్రయించగా వచ్చిన ఆదాయంలో దాదాపు 5 కోట్ల రూపాయలను ఫ్రంట్లైన్ వారియర్స్ కు అందిస్తున్నట్టు ప్రకటన చేశారు. అందులో భాగంగా ఫిలిం ఎంప్లాయీస్ ఫెడ‌రేష‌న్ ఆఫ్ సౌత్ ఇండియా కార్మికుల కుటుంబాల స‌హాయార్థం రూ.1.5 కోట్లు విరాళంగా అంద‌జేశాడు.

ఈ మేరకు ఎఫ్ఈఎఫ్ఎస్ఐ అధ్యక్షుడు ఆర్‌కే సెల్వమ‌ణికి చెక్కును అందజేశారు. మిగిలిన డబ్బును అగరం ఫౌండేషన్‌ కు అందిస్తునట్టు ప్రకటించారు. లాక్ డౌన్ నేపథ్యంలో షూటింగ్స్ లేక సినీ కార్మికులు నష్టాల్లో కూరుకుపోయారు. టాలీవుడ్ సినీ కార్మికుల పరిస్థితి అత్యంత దుర్భరంగా ఉంది. కృష్ణానగర్ పరిసర ప్రాంతాల్లో నివాసముంటున్న కార్మికులు ఉపాధి లేక స్వగ్రామాలకు పయనమవుతున్నారు. మరోవైపు ప్రభుత్వం మరియు స్వచ్ఛంద సంస్థలు అందిస్తున్న సాయం అంతంతమాత్రంగానే ఉండటంతో కార్మికుల బతుకులు దారుణంగా తయారయ్యాయి.

షూటింగ్స్ కు కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చినప్పటికీ హీరోలు మాత్రం ముందుకు రావడం లేదు. ఒకప్పటిలాగా ఉపాధి ఉండే అవకాశం కూడా లేదు. మూవీ ప్రొడ్యూసర్లు సినిమా వ్యయాన్ని తగ్గించుకోవడానికి ప్రయత్నిస్తుండటంతో సినీ కార్మికులకు లభించే జీతాల్లో కోత పడుతుంది. తెలుగు హీరోలు కూడా స్వచ్ఛందంగా ముందుకొచ్చి సాయం చేయాలని సినీ కార్మికులు కోరుకుంటున్నారు. ఇక సూర్య నటించిన సూరరై పోట్రు చిత్రం అమేజాన్‌ ప్రైమ్‌ అక్టోబర్‌ 30వ తేదీన విడుదల కానుంది. భారతదేశ చరిత్రలో మొట్టమొదటి సారిగా ఈ చిత్రం రెండు వందల దేశాల్లో విడుదల కానుంది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad