Home సినిమా హ‌రి తేజ.. ఫ‌స‌క్!

హ‌రి తేజ.. ఫ‌స‌క్!

ఫ‌స‌క్‌, ఈ ప‌దం ఇటీవ‌ల కాలంలో ఎంత‌లా పాపుల‌ర్ అయిందో అంద‌రికీత ఎలిసిందే. ఓ ప్ర‌ముఖ న్యూస్ ఛానెల్‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో టాలీవుడ్ సీనియ‌ర్ న‌టుడు మంచు మోహ‌న్‌బాబు మాట్లాడుతూ ఫ‌స‌క్ అనే ప‌దాన్ని వాడారు. ఇంట‌ర్వ్యూ చేసే వ్య‌క్తికి ఓ సినిమా స్టోరీనీ చెబుతూ నాట్ మెనీ టైమ్స్‌, ఓన్లీ వ‌న్ టైమ్ ఫ‌స‌క్ అంటూ చేతిని అడ్డంగా ఊపారు. ఇక అప్ప‌ట్నుంచి ఫ‌స‌క్ అనే ప‌దం తెగ వైర‌ల్ అయిపోయింది.

మోహ‌న్‌బాబు చెప్పిన ఆ ఫ‌స‌క్ డైలాగ్‌తో డీజేలు, యూట్యూబ్ ఛానెళ్లు, సినిమా వాళ్లు తెగ వాడేసుకున్నారు. ఓన్లీ వ‌న్ టైమ్ ఫ‌స‌క్ అనే డైలాగ్‌తో హాస్యాన్ని పండిస్తున్నారు. తాజాగా ఈ ప‌దాన్ని వాడిన న‌టుల్లో తాజాగా న‌టి హ‌రితేజ చేరిపోయింది.

కాగా, ఆదివారం రాత్రి విశాఖ‌ప‌ట్నం వేదిక‌గా ఎఫ్‌2 చిత్రం ఆడియో ఫంక్ష‌న్‌ను జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రంలో విక్ట‌రీ వెంక‌టేశ్‌, వ‌రుణ్‌తేజ్‌లు హీరోలుగా న‌టించ‌గా, త‌మ‌న్నా, మెహ్రీన్ కౌర్ హీరోయిన్లుగా న‌టించారు. ఆడియో వేడుక‌లో భాగంగా ఎఫ్‌2లో న‌టించిన హ‌రితేజ మాట్లాడుతూ వెంక‌టేష్ హీరోగా న‌టించిన నువ్వునాకు న‌చ్చావ్ చిత్రంలోని ఓ కామెడీ డైలాగ్‌ను మార్చి చెప్పింది.

దేవుడా ఓ మంచి దేవుడా, సినిమా అన‌గానే డ‌బ్బు క‌ట్ట‌ల‌తో ఇంట్రెస్టింగ్‌గా ముందుకొచ్చే మా శ్రీ శ్రీ‌నివాస క్రియేష‌న్స్ బ్యాన‌ర్ ఇచ్చావు. సినిమా అన‌గానే త‌న ప్రాణాన్నైనా ప‌ణంగాపెట్టి జ‌నాల్ని ప్రాణం పోయేలాగా న‌వ్వించే మా అనీల్‌రావిపూడిన‌చ్చావ్‌. సినిమా అన‌గానే ఆట‌ల‌తో, పాట‌ల‌తో, వాళ్ల న‌ట‌న‌తో మ‌న‌ల్ని అందంగా న‌వ్వించే వ‌రుణ్ తేజ్‌ను, వెంక‌టేశ్‌ను ఇచ్చావ్‌. ఇలాగే, ఈ ఆనందాన్ని ఈ ఎంట‌ర్‌టైన్‌మెంట్‌ను ప్ర‌పంచంలో ఎంత‌మంది ఉంటే.. అంత‌మందికీ, దేశంలో ఎంత‌మంది ఉంటే అంతమందికీ ఇవ్వాల‌ని నేను కోరుకుంటున్నా. నువ్వు ఇస్తావ్ ఎందుకంటే యువ‌ర్ గాడ్, యువ‌ర్ గ్రేట్, యువిల్ గివిట్ అంటూ న‌వ్వులు పూయించింది.

కామెడీ డైలాగ్ చెప్ప‌గాను మైక్ అందుకున్న యాంక‌ర్ సుమ మాట్లాడుతూ ఈ చిత్రం ఎలా ఉండ‌బోతుంది అంటూ అడ‌గ్గా అందుకు స్పందించిన హ‌రితేజ ఫ‌స‌క్ అని రిప్లై ఇచ్చింది. ఆ వెంట‌నే మంచు మోహ‌న్‌బాబును గుర్తు చేసుకున్న యాంక‌ర్ సుమ ఒక్క‌సారిగా సైలెంట్ అయిపోయి ప‌క్క‌నే ఉన్న న‌టుడు స‌త్యం రాజేశ్‌ను మాట్లాడ‌మంటూ మైక్‌ను అందించింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad