Home సినిమా టాలీవుడ్ న్యూస్ చుక్కల్లోకెక్కిన బర్త్‌డే పాప.. మాటల్లేవట!

చుక్కల్లోకెక్కిన బర్త్‌డే పాప.. మాటల్లేవట!

Hansika Recieves Unique Birthday Gift

అందాల భామ హన్సికా మోత్వానీ టాలీవుడ్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఈ బ్యూటీ నటించిన పలు సినిమాలు ప్రేక్షకులను మెప్పించడంలో సక్సెస్ అయ్యాయి. ఇక వరుసగా సినిమాలు చేస్తున్న తరుణంలో తమిళంలో అవకాశాలు వెత్తుకుంటూ వెళ్లిన ఈ బొద్దు బ్యూటీ, ఆ తరువాత అక్కడే ఎక్కువ సినిమాలు చేస్తూ సెటిల్ అయిపోయింది. దీంతో టాలీవుడ్‌లో దాదాపు కనుమరగైన హన్సికా ప్రస్తుతం కోలీవుడ్‌పైనే దృష్టి పెట్టింది.

కాగా ఆగస్టు 9న హన్సికా తన పుట్టినరోజును జరుపుకుంది. ఈ క్రమంలో పలువురు సెలబ్రిటీలతో పాటు ప్రేక్షకులు, ఫ్యాన్స్ అమ్మడికి బర్త్‌డే విషెస్‌ను తెలిపారు. మరికొంత మంది ఆమెకు పుట్టినరోజు కానుకలను కూడా అందించారు. అయితే హన్సికా ఎప్పటికీ మర్చిపోలేని ఓ బహుమతిని ఆమె కుటుంబ సభ్యులు అందజేశారు. సౌర కుటుంబంలో ఓ నక్షత్రాన్ని హన్సికా పేరుపై రిజిస్టర్ చేయించి ఆమెకు ఊహించని బహుమతిని అందజేశారు. ఈ బహుమతి గురించి తెలుసుకున్న హన్సికా తనకు మాటల్లేవని సంతోషంతో పొంగిపోయింది.

తన కుటుంబ సభ్యులు ఇలా తనకు అరుదైన బహుబతిని ఇస్తారని తాను ఊహించలేదని ఆమె అంటోంది. ఇక తనకు వచ్చిన ఈ అరుదైన బహుమతి గురించిన వివరాలను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఇక సినిమాల విషయానికి వస్తే, హన్సికా ప్రస్తుతం తమిళంలో రెండు మూడు సినిమాలు చేస్తోంది. అందులో ఆమె కెరీర్‌లో నటిస్తున్న 50వ చిత్రం ‘మహా’ కూడా ఉండటం విశేషం. మరి ఈ బొద్దు బ్యూటీ తిరిగి టాలీవుడ్‌లో ఎప్పుడు రీఎంట్రీ ఇస్తుందా అని ఆమె అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad