టాలీవుడ్లో ప్రముఖ హాస్యనటుడు ఆలీ సినీ రంగం లోకి అడుగిడి నలభై సంవత్సరాలు పూర్తి చేశాడు. ప్రెసిడెంట్ పేరమ్మ చిత్రం తో 1979 లో బాల నటుడిగా సినీ పరిశ్రమలో అరంగేట్రం చేసిన ఆలీ ఈరోజు స్టార్ కమెడియన్ స్థాయికి ఎదిగారు. సీతాకోక చిలుక, ఆ తర్వాత ‘జంబలకిడి పంబ’, రాజేంద్రుడు గజేంద్రుడు, మాయలోడు, హలో బ్రదర్, ఘటోత్కచుడు, పిట్టలదొర పలు సినిమాల్లో నటించాడు. యమలీల సినిమాతో హీరో గా పరిచయమయ్యాడు. ఆలీ నటుడిగా, హాస్య నటుడిగా, యాంకర్ గా వెండితెర పై ప్రేక్షకుల ను అలరించి అభిమానుల మనసు దోచేశాడు.
అవార్డ్స్:
1981 | సీతా కొక చిలుక | బెస్ట్ చైల్డ్ యాక్టర్ అవార్డు |
1996 | పిట్టలదొర | నంది స్పెషల్ జ్యూరీ అవార్డు |
2003 | అమ్మ నాన్న ఓ తమిళమ్మాయి | ఫిల్మ్ ఫేర్ బెస్ట్ కమెడియన్ |
2005 | సూపర్ | ఫిల్మ్ ఫేర్ బెస్ట్ కమెడియన్ |
ఎన్నో అవార్డ్స్ తో పాటు డాక్టర్ గౌరవాన్ని కూడా సంపాదించుకున్నాడు కమెడియన్ ఆలీ. యూనివర్సల్ గ్లోబల్ పీస్ అకాడమీ వారు డాక్టరేట్ నటుడు-హాస్యనటుడుగా సేవలను గుర్తుంచి ఆలీ కి డాక్టరేట్ ఇచ్చారు. కానీ ఆలీ ‘నా పేరుకు డాక్టర్ ట్యాగ్ ను అటాచ్ చేయలేకపోతున్నాను. ఈ గౌరవానికి గాను చాల ఆనందం తోపాటు ,ఆశ్చర్యముగా ఉందన్నారు. ఈ గౌరవాన్ని నా తండ్రి మొహమ్మద్ బాషా కి అంకితం చేస్తున్నాను.’ అని వారి తండ్రి కి 2013 లో అంకితం చేశాడు.
చిత్రపరిశ్రమలో ఆలీ 40 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చూసుకుంటున్న కారణంగా ఈ నెల 23 తేదీన సాయంకాల సమాయన ఆరు గంటలకు సాంస్కృతిక సంస్థ సంఘమం వారు ఘనంగా సత్కరిస్తున్నారు. ఈ కార్యక్రమము విజయవాడ వద్ద తుమ్మలపల్లి కళాక్షేత్ర భవనంలో జరుగనుంది. ఈ వేడుకకు చీఫ్ గెస్ట్‌గా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరవుతున్నారు. డిప్యూటీ స్పీకర్ బుద్ధ ప్రసాద్, ప్రముఖ దర్శకులు రాఘవేంద్రరావు ఎంతో మంది ప్రముఖులు హాజరు కానున్నారు. సినీ పరిశ్రమ నుండి కొంత మంది ప్రముఖులు ఆలీని స్వర్ణ కంకణ బహుమానంతో సన్మానిస్తున్నారు.