
స్టార్ డైరెక్టర్ శంకర్ డైరెక్ట్ చేసిన ‘బాయ్స్’ చిత్రంతో ప్రేక్షకులను ఎంతగానో అలరించిన బ్యూటీ జెనిలియా, ఆ తరువాత బొమ్మరిల్లు చిత్రంలో హాసిని పాత్రలో నటించి ప్రేక్షకులను మెప్పించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ఆమె పర్ఫార్మెన్స్కు ప్రేక్షకులు పట్టం కట్టారు. ఇక ఈ సినిమా తరువాత వరుసబెట్టి సినిమాలు చేస్తూ దక్షిణాదిన దూసుకుపోయింది ఈ బ్యూటీ.
కాగా కొంత కాలం తరువాత వరుసగా ఫెయిల్యర్ చాత్రాలు ఎదురుకావడతో ఆ తరువాత బాలీవుడ్ హీరో రితేష్ దేష్ముక్ను పెళ్లి చేసుకుని ప్రస్తుతం తన జీవితాన్ని ఆనందంగా గడుపుతోంది. అయితే ఈ బ్యూటీకి ఇటీవల కరోనా పాజిటివ్ అని తేలడంతో ఇండస్ట్రీ వర్గాలు కూడా షేక్ అయ్యాయి. ఈ క్రమంలో ఆమె గతకొద్ది రోజులుగా ఆమె ఐసోలేషన్లో ఉంటున్నట్లు తెలిపింది. కాగా తాజాగా ఆమెకు కరోనా నెగెటివ్ అని తేలడంతో ఆమె తన సంతోషాన్ని వ్యక్త పరిచింది. అయితే ఐసోలేషన్లో ఒంటరిగా ఉండటం నిజంగా నరకమే అంటోంది ఆమె.
కాగా అందరూ తమ ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండాలని, కరోనా టెస్టులు చేయించుకుని ఆరోగ్యంగా ఉండాలంటూ ఆమె సూచించింది. ఇక తనకు కరోనా నెగెటివ్ రావడంతో ఆమె అభిమానులకు ధన్యవాదాలు తెలిపింది. ఏదేమైనా ఇలా ఓ స్టా్ర్ బ్యూటీ కూడా కరోనా బారిన పడి కోలుకోవడంతో అందరూ అవాక్కవుతున్నారు. ఈ బ్యూటీ ప్రస్తుతం సినిమాల్లో మళ్లీ రీఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిస్తోంది.