Home టాప్ స్టోరీస్ నిర్మాతల కష్టాలు హీరోలకు ఎక్కవ?

నిర్మాతల కష్టాలు హీరోలకు ఎక్కవ?

tollywood logo

లాక్ డౌన్ కారణంగా భారీగా నష్టపోయిన రంగాల్లో సినిమా ఇండస్ట్రీ ఒకటి. సినీ పరిశ్రమలో ఎటువంటి సంక్షోభ పరిస్థితి ఏర్పడిన మొదట నష్టపోయేది నిర్మాతలే. నటి నటీమణులు సినిమాకు ముందే భారీ పారితోషికం అందుకోవటం మరియు విజయంతో వారికి సంబంధం లేకుండా ఉండటం వాళ్లకు కలిసొచ్చే అంశం. అయితే ప్రొడ్యూసర్ల పరిస్థితి ఇలా ఉండదు. సినిమా విడుదలై విజయం సాధిస్తే తప్పవారికి డబ్బులు రావు.

ప్రస్తుతం లాక్ డౌన్ కారణంగా థియేటర్లు మూతపడి ఉన్నాయి. ఎప్పుడు తెరుచుకుంటాయన్నది ఎవరికీ తెలియడం లేదు. దీంతో చాలా మంది నిర్మాతలు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తున్నారు. అయితే టాలీవుడ్ లో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. ఈమధ్య హీరోలు పారితోషికంతో పాటు సినిమాలో షేర్ ను కూడా తీసుకుంటున్నారు. దీనివలన నిర్మాతలు స్వతంత్ర నిర్ణయాలు తీసుకునే అవకాశం లేకుండా పోయింది. అంటే ఇప్పుడు ఓటీటీలో సినిమాని విడుదల చేయాలంటే కేవలం నిర్మాత అనుకుంటే సరిపోదు, కచ్చితంగా సదరు హీరో పర్మిషన్ కూడా కావాలి. కానీ టాలీవుడ్ లో మెజారిటీ హీరోలెవరూ తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేయడానికి సిద్ధంగా లేరు.

ప్రొడ్యూసర్లు సినిమా కోసం భారీగా అప్పులు చేయడంతో ఇప్పుడు వారందరూ వడ్డీ కట్టవలసి వస్తుంది. ఈ సమయంలో సినిమాలను పోటీలో విడుదల చేయడం ద్వారా మాత్రమే నష్టాలను పుడ్చుకోవచ్చు. కోలీవుడ్ లో తమిళ హీరోలు తమ సినిమాలను ఓటీటీలో విడుదల చేస్తూ ప్రొడ్యూసర్లని ఆదుకుంటున్నారు. అటువంటి పరిస్థితి తెలుగునాట కూడా రావాలని మెజారిటీ నిర్మాతలు అనుకుంటున్నట్లు తెలుస్తోంది. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad