Home సినిమా ఎన్టీఆర్ అభిమానులకు షాకింగ్ న్యూస్ : పాపం ఫ్యాన్స్..

ఎన్టీఆర్ అభిమానులకు షాకింగ్ న్యూస్ : పాపం ఫ్యాన్స్..

RRR movie

తెలుగు రాష్ట్రాల్లో ఎన్టీఆర్ కు ఉన్న అభిమాన తారాగణం గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రతి వేదిక మీద తన ఫాన్స్ గురించి ఎంతో గర్వం చెప్పే ఎన్టీఆర్ అంటే ఫ్యాన్స్ కు ప్రాణం. టెంపర్, నాన్నకు ప్రేమతో ,జనతా గ్యారేజ్, జై లవకుశ వంటి వరుస విజయాలుతో దూసుకుపోతున్న తారక్ ప్రస్తుతం టాలీవుడ్ దిగ్గజ దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ మూవీ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ సినిమా నుండి మోషన్ పోస్టర్ మరియు రామ్ చరణ్ కు సంబంధించిన ఫస్ట్ లుక్, టీజర్ విడుదలయ్యాయి. అయితే ఎన్టీఆర్ కు సంబంధించిన ఫస్ట్ గాని టీజర్ గాని ఇప్పటివరకు విడుదలకు కాలేదు. ఎన్టీఆర్ పుట్టినరోజు మే 20 నాడు టీజర్ విడుదలవుతుంది అనుకున్నప్పటికీ మూవీ టీం నుంచి మాత్రం ఎటువంటి అప్డేట్ రాలేదు.

.ఆప్పటి నుండి ఎన్టీఆర్ ఫ్యాన్స్ తారక్ ఫస్ట్ లుక్ కోసం ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. రేపోమాపో వస్తుందని సోషల్ మీడియాలో ప్రచారం జరిగినప్పటికీ ఇప్పటివరకు ఎటువంటి అప్డేట్ విడుదల కాలేదు. అయితే తాజాగా మరో న్యూస్ సోషల్ మీడియాలో ట్రెండ్ గా మారింది. ఈ ఆగస్టు 15 నాడు ఆర్ఆర్ఆర్ మూవీ నుండి ఎన్టీఆర్ కొమరం భీమ్ ఫస్ట్ లుక్ విడుదల అవుతుందని విస్తృతంగా ప్రచారం జరిగింది. అదే రోజు సింహాద్రి సినిమా విడుదల కావడంతో తప్పకుండా టీజర్ వస్తుందని అభిమానులు కొండంత ఆశతో ఉన్నారు. అయితే తాజాగా తెలుస్తున్న సమాచారం ప్రకారం ఆర్ఆర్ఆర్ మూవీ టీం నుండి ఎటువంటి టీజర్ కానీ ఫస్ట్ లుక్ ని విడుదల కావడం లేదు. సోషల్ మీడియాలో వస్తున్న వార్తలపై స్పందించిన మూవీ టీం ఇటువంటి అప్డేట్ విడుదల చేయడం లేదని తెలిపింది.

దీంతో ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరోసారి తీవ్రమైన నిరాశ లో కూరుకుపోయారు. ఇటీవలే రాజమౌలి మరియు అతని కుటుంబ సభ్యులు కరోనా పాజిటివ్‌ రావడంతో నిర్బంధంలో ఉన్నారు. కాబట్టి టీజర్‌ లేదా ఆర్‌ఆర్‌ఆర్ యొక్క ఫస్ట్ లుక్ పోస్టర్‌తో వచ్చే అవకాశం దాదాపు లేనట్టే. ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమురం భీమ్ పాత్రలో నటిస్తున్నారు. ఇండస్ట్రీలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం మూవీలో తారక్ ఆరు గెటప్స్ లో కనిపించనున్నారని తెలుస్తోంది. పోలీసుల నుండి తప్పించుకునేందుకు ఆయన చేసే సాహసాలు సినిమాకు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయని అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad