Home సినిమా టాలీవుడ్ న్యూస్ నిర్మాతల కొంపముంచుతున్న స్టార్ హీరోల ఫ్యాన్స్

నిర్మాతల కొంపముంచుతున్న స్టార్ హీరోల ఫ్యాన్స్

Fans Making Sound In Twitter But Not In Theatres

టాలీవుడ్‌లో స్టార్ హీరోల సినిమాలు రిలీజ్ అయినప్పుడు వాటి మధ్య ఏరప్పడే వార్ ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. ఈ సినిమాలు బాక్సాఫీస్ వద్ద చేసే సందడి దాదాపు ఓ పండగ వాతావరణంలా మారుతుంది. ఇక తమ హీరో సినిమా సూపర్ అని, తమ హీరో సినిమా బంపర్ అని తమ అభిమాన హీరో సినిమా గురించి వారు గొప్పలు చెబుతుంటారు. అయితే ఇదంతా ఒకప్పటి విషయం అని చెప్పాలి. ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని పరిస్థితి మారిపోయింది.

ప్రస్తుతం కేవలం సోషల్ మీడియా రికార్డులను టార్గెట్ చేస్తున్నారు ఫ్యాన్స్. ట్విట్టర్‌లో తమ హీరో ట్వీట్ ఎన్ని మిలియన్‌లు సాధించింది, అది ఎన్ని గంటల్లో సాధించింది, ట్రెండింగ్‌లో ఉందా లేదా అనేది మాత్రమే ఫ్యాన్స్ పట్టించుకుంటున్నారు. అయితే ఇది ఆయా హీరోల సినిమాలపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తూ, బాక్సాఫీస్ వద్ద నిర్మాతల కొంప ముంచుతోంది. దీనికి సరైన ఉదాహరణగా ఇటీవల రిలీజ్ అయిన సరిలేరు నీకెవ్వరు సినిమా నిలిచిందని చెప్పాలి.

సినిమా రిలీజ్‌కు ముందుకు మహేష్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసిన రచ్చ మామూలుది కాదు. ఇక తీరా సినిమా రిలీజ్ తరువాత ఆ చిత్రం రేసులో ఉన్న అల వైకుంఠపురములో సినిమా కంటే వెనుకబడిపోయింది. దీంతో ఆ నిర్మాతకు పెద్దగా ఏమీ మిగలలేదు. ఇలా సినిమాపై అమాంతం అంచనాలు పెంచే పనినే పెట్టుకుని, నిర్మాతల కొంప ముంచడం ఫ్యాన్స్‌కు సబబు కాదని సినీ ఎక్స్‌పర్ట్స్ అంటున్నారు. మారుతున్న ట్రెండ్‌ను ఫాలో అవ్వడం కరెక్టే కానీ, ఒక సినిమా ఆడాలంటే దాన్ని ఖచ్చితంగా థియేటర్లో నడిపించాల్సిన బాధ్యత ఫ్యాన్స్‌కే ఉంటుందని వారు అంటున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad