Home సినిమా గాసిప్స్ అనారోగ్యంతో బాధపడుతున్న సెలబ్రిటీలు.. ఎవరికి ఏముందంటే?

అనారోగ్యంతో బాధపడుతున్న సెలబ్రిటీలు.. ఎవరికి ఏముందంటే?

Famous Celebrities

సినీస్టార్స్ లో చాలా వ‌ర‌కు రిచ్ పీపులే.  ఎందుకంటే సిల్వ‌ర్ స్క్రీన్ పై ఒక వెలుగు వెలిగి బాగా సంపాదిస్తుంటారు. దీంతో   వారి ద‌గ్గ‌ర అన్ని ర‌కాల సౌక‌ర్యాలు ఉంటాయి .  కాబ‌ట్టి వారంతా చాలా ఆరోగ్యంగా ఉంటార‌ని మ‌నం అనుకుంటూ ఉంటాం. కానీ వాళ్ళు కూడా మనుషులే అని…. వాళ్లకి కూడా ఎన్నో సమస్యలు ఉంటాయన్న విషయాన్ని మ‌ర‌చిపోతుంటాం. మన సెలబ్రిటీల్లో చాలా మంది  ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. వాటిల్లో కొన్ని ఆరోగ్య సమస్యల పేర్లు మనం విని కూడా ఉండము. అంత అరుదుగా వచ్చే ఆరోగ్య వ్యాధులు  అవి. అలా ఆరోగ్యపరమైన ఇబ్బందులు ఎదుర్కొన్న సెలబ్రిటీల్లో కొంద‌రి గురించి  తెలుసుకుందాం.

అమితాబ్ బ‌చ్చ‌న్‌. బాలీవుడ్ సూప‌ర్ స్టార్ . కోరుకున్న‌ద‌ల్ల క‌ళ్ల ముందు తెప్పించుకోగ‌ల స‌త్తా ఉన్నా న‌టుడు. ఈయ‌న మయాస్థేనియా గ్రేవీస్ అనే వ్యాధి తో పోరాడుతున్నారు.  ఈ వ్యాధి వల్ల ఎముకలు బలహీనంగా అయిపోతాయి. దీంతో  చూడడానికి, నడవడానికి, మాట్లాడడానికి కూడా ఇబ్బంది పడతారు. గోవా బ్యూటీ అన‌గానే మ‌న‌కు ఇలియానా గుర్తు వ‌స్తుంటుంది. ఈమె కూడా ఒక అరుదైన వ్యాధిని ఎదుర్కొన్నారు. బాడీ డిస్మోర్ఫిక్ డిసార్డర్ అని వ్యాధితో చాలాకాలం బాధపడ్డారు. ఈ వ్యాధి వల్ల తమపై తమ కి నమ్మకం పోతుంది.  ఏమి సాధించలేము  అనే భయం వెంటాడుతుంది.  చూడడానికి ఎలా ఉంటాము అని ఇన్ సెక్యూరిటీ భావ‌న కూడా  వ‌స్తుంది. 

ఒక్కొక్కసారి ఆత్మహత్య ఆలోచనలు కూడా వస్తాయట. బాలీవుడ్ లో త‌క్కువ స‌మ‌యంలోనే మంచి పేరు తెచ్చుకున్న న‌టి ప‌రిణితి చోప్రా. చూడ‌చ‌క్క‌ని రూపం, అంద‌కు మించిన అభిన‌యంతో కొట్లాది కుర్ర‌కారు గుండెల‌ను కొల్ల‌గొట్టింది. ఈమె కూడా చాలా కాలం డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డ్డారు. ఈ విష‌యాన్ని స్వ‌యంగా ఆమే చెప్పారు. త‌మిళ సూప‌ర్ స్టార్ త‌లైవా అన‌గానే మ‌న‌కు ర‌జినీకాంత్ గుర్తుకొస్తాడు. దేశంలోనే కాదు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అభిమానుల‌ను సంపాదించుకున్నాడు ఈయ‌న‌. ర‌జినీకాంత్ కూడా బ్రోన్చైటిస్ అనే వ్యాధితో బాధ‌ప‌డ్డారు. ఈ జ‌బ్బు వ‌ల్ల శ్వాస‌ప‌ర‌మైన ఇబ్బందుల‌తో ఊపిరితిత్తులు ఎఫెక్ట్ అవుతాయి. అందాల తార న‌య‌న‌తార చ‌ర్మ సంబంధిత స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నారు. అందాల తార సోన‌మ్  క‌పూర్ కూడా రెండు ఆరోగ్య స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొంటున్నారు.

ఫ్యాషన్ ఐకాన్ సోనమ్ కపూర్ కి 17 ఏళ్ల వయసున్నప్పుడు……. డయాబెటిస్ ఉన్నట్టు తెలిసింది. అంతేకాదు…. సినిమాల్లోకి రాకముందు సోనమ్ కి ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ కూడా ఉండేది. ఇక చిల్‌బుల్ బ్యూటీ స‌మంత కూడా కొన్ని స‌మ‌స్య‌ల‌ను ఎదుర్కొన్నారు. 2013లో సమంత చర్మానికి సంబంధించిన అలర్జీ తో బాధపడ్డారు. కొంత కాలానికి కోలుకున్నారు. అంతేకాకుండా సమంతకి డయాబెటిస్ కూడా ఉంది అని వార్తలు వచ్చాయి. బాలీవుడ్ లేడీ సూప‌ర్ స్టార్ దీపికా ప‌దుకోన్‌.  డిప్రెషన్ గురించి సెలబ్రిటీలలో ఎక్కువగా మాట్లాడిన వ్యక్తి దీపిక. మామూలుగా స్టార్స్ తమ సమస్యలను బయట చెప్పుకోవడానికి ఇష్టపడరు. వాళ్ళు బలహీనులు అని జనాలు అనుకుంటారేమో అన్న భయం వారిని వెంటాడుతుంది. అలాంటి సమయంలో దీపిక తనకి మానసిక బలం చాలా తక్కువ అని, జీవితంలో ఏదో కోల్పోయినట్టు ఉండేది అని చెప్పింది.

  ప్రేమికుల రోజు సినిమాతో కుర్ర‌కారు గుండెల‌ను కొల్ల‌గొట్టిన న‌టి సోనాలి బింద్రే. ఈమె కూడా మెటాస్టాటిక్ క్యాన్స‌ర్‌తో బాధ‌ప‌డ్డారు. శరీరంలో ఒక భాగం నుండి మరో భాగానికి పాకే ఈ మెటాస్టాటిక్ క్యాన్సర్ తో….. పోరాడి గెలిచారు సోనాలి. మ‌రో బ్యూటీ అనుష్క శ‌ర్మ కూడా ఆంగ్జైటీ అనే అరుదైన వ్యాధితో బాధ‌ప‌డ్డారని సోష‌ల్ మీడియాలో వార్త‌లు వ‌చ్చాయి. దీని గురించి ప్రజలలో ఇంకా అవగాహన తీసుకురావాలని ప్రయత్నిస్తున్నానని చెప్పారు. బాలీవుడ్ యంగ్ హీరో వ‌రుణ్ ధావ‌న్ కూడా డిప్రెష‌న్‌తో బాధ‌ప‌డ్డాడు. బద్లాపూర్ సినిమా సమయంలో క్యారెక్టర్ కోసం ఎక్కువ ఇన్వాల్వ్ అవడంతో ……  డిప్రెషన్ లోకి వెళ్ళాడు వరుణ్ ధావన్. ఆ తర్వాత డాక్టర్ల సహాయంతో కోలుకున్నాడు.

బాలీవుడ్ కండ‌ల‌వీరుడు స‌ల్మాన్ ఖాన్ కూడా చాలా అరుదైన వ్యాధితో బాధ‌ప‌డుతున్నాడు. ట్రైజెమిన‌ల్ న్యూరాల్జియా అనే వ్యాధిని ఎదుర్కొన్నాడు.  ఈ వ్యాధి వ‌ల్ల ముఖం నుండి మెదడు కి కనెక్ట్ అయిన ఒక నరం ఎఫెక్ట్ అవుతుంది. దీని వ‌ల్ల నములుతున్నప్పుడు, మాట్లాడుతున్నప్పుడు, బ్రష్ చేసుకుంటున్నప్పుడు….. ముఖం అంతా నొప్పిగా అనిపిస్తుంది. ఇక అందాల తార మ‌నీషా కొయిరాలా కూడా చాలా భ‌యంక‌ర‌మైన వ్యాధిని ఎదుర్కొన్నారు. అదే క్యాన‌ర్‌. అయితే క్యాన‌ర్‌తో పోరాడి కోలుకున్నారు మ‌నీషా. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్ కూడా డిప్రెష‌న్ వ్యాధిని ఎదుర్కొన్నారు. 2010లో ఒక గాయం కారణంగా తను బాధతో డిప్రెషన్ లోకి వెళ్లి పోయాను అని….., సర్జరీ తర్వాత తన గాయం నుండి కుటుంబం సహాయంతో కోలుకున్నాను చెప్పారు.

యూనివ‌ర్శ‌ల్ హీరో క‌మ‌ల్ హాస‌న్ కూడా టైప్ వ‌న్ డ‌యాబెటిస్ వ్యాధిని ఎదుర్కొన్నారు. దీని వ‌ల్ల శరీరంలో గ్లూకోస్ మోతాదు తగ్గి ఇమ్యూన్ సిస్టం సరిగా ఉండ‌దు. ఎక్కువ ఆకలి వేయడం, ఏదీ స్పష్టంగా కనిపించకపోవడం ఈ డయాబెటిస్  లక్షణాలు. కమల్ హాసన్ టైప్ 1 డయాబెటిస్ తో బాధపడుతున్నారు. ఈ టైప్ 1 డయాబెటిస్ పూర్తిగా తగ్గడం అనేది ఉండదు. గ్లూకోజ్ మోతాదు తగ్గిన ప్రతి సారి…. ఇన్సులిన్ సహాయంతో మళ్లీ మామూలు స్థితికి వస్తారు. ఇలా ఎంతో మంది న‌టీన‌టులు చేతి నిండా డ‌బ్బు, సంపాద‌న ఉన్నా కూడా ఏదో ఒక రోగంతో బాధ‌పడ్డారు. ఇంకా బాధ‌ప‌డుతునే ఉన్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad