Home సినిమా విడిచి పెట్టే ప్రసక్తే లేదు : ఈటీవీ హెచ్చరిక

విడిచి పెట్టే ప్రసక్తే లేదు : ఈటీవీ హెచ్చరిక

etv thumb

లాక్ డౌన్ కారణంగా దేశంలోని మూవీ థియేటర్స్ మూతపడడంతో అనేక సినిమాలు ఓటిటి వేదికల ద్వారా విడుదల అవుతున్నాయి. కీర్తి సురేష్ నటించిన పెంగ్విన్, భానుమతి రామకృష్ణ వంటి సినిమాలు విడుదలయ్యాయి మంచి విజయాన్ని అందుకున్నాయి. ఓటిటి వేదికలు ప్రొడ్యూసర్లకు కాసుల పంట పండిస్తున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాలకు మంచి లాభాలను తీసుకురావడంతో ఎక్కువ మంది దర్శక నిర్మాతలు ఇటువైపుగా అడుగులు వేస్తున్నారు. ఒకప్పుడు థియేటర్లో సినిమా రిలీజ్ అయినప్పుడు పైరసీ భూతం ఇండస్ట్రీని భయపెట్టింది.

బాహుబలి, గీత గోవిందం వంటి సినిమాలు రిలీజ్ కు ముందే నెట్టింట్లో దర్శనమివ్వడంతో దర్శక నిర్మాతలు సైబర్ సేల్ ను ఆశ్రయించడం జరిగింది. ఆ తర్వాత కూడా పైరసీ పెరుగుతూనే ఉంది.వేగంగా విస్తరిస్తున్న ఇంటర్నెట్ మూలంగా పైరసీ వెబ్ సైట్లు మారుమూల గ్రామాలకు కూడా చేరిపోతున్నాయి. తమిళ్ రాకర్స్, మూవీ రూల్స్ వంటి వెబ్ సైట్స్ సినిమాలను పైరసీ చేస్తూ కోట్లలో లాభాలను అర్జిస్తున్నాయి. ప్రభుత్వాలు ఈ వెబ్సైట్లను ఎన్నిసార్లు బ్లాక్ చేసిన మరల కొత్త డొమైన్ తో వస్తు సీనీ పెద్దలకు తలనొప్పిగా మారుతున్నాయి. అయితే ఇప్పుడు ఈ పైరసీ భూతానికి తోడు లోకల్ టెలివిజన్ ఛానల్స్ మరో కొత్త సమస్యగా మారాయి. తాజాగా సత్యదేవ్ నటించిన ఉమా మహేశ్వర ఉగ్రా రూపస్య సినిమా నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై మంచి విజయాన్ని అందుకుంది. చాలా కాలం తరువాత ఒక తెలుగు చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో విడుదలై సంచలనం సృష్టించగలిగింది.

అయితే తెలుగు రాష్ట్రాల్లోని స్థానిక టీవీ ఛానెళ్ళు సినిమాలను పైరసీ వెబ్ సైట్ల ద్వారా డౌన్లోడ్ చేసుకుని తమ నెట్వర్క్ లో ఎటువంటి భయం లేకుండా టెలికాస్ట్ చేస్తున్నాయి. ఉమా మహేశ్వర ఉగ్రా రూపస్య చిత్రం యొక్క శాటిలైట్ రైట్స్ ను ఈ టీవీ సొంతం చేసుకుంది. ఈ సమయంలో కొన్ని లోకల్ కేబుల్ టీవీ ఆపరేటర్ లు మరియు టీవీ ఛానల్స్ ఈ సినిమాను తమ నెట్వర్క్ లో ప్రసారం చేశాయి. ఈ విషయం ఈ టీవీకి తెలియడంతో వారిపై కఠిన చర్యలు తీసుకోబోతున్నట్లు పత్రికా ప్రకటనను విడుదల చేసింది. ఈ సినిమాను వెంకటేష్ మహా దర్శకత్వం వహించగా బాహుబలి నిర్మాతలు ఆర్కా మీడియా ఈ ప్రాజెక్టును నిర్మించింది. స్థానిక టీవీ ఛానళ్ళు కాపీరైట్ చట్టాలను తుంగలో తొక్కుతూ ఈ విధంగా సినిమాలు ప్రసారం చేయడంపై ఇండస్ట్రీ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad