Home సినిమా రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న.. శ్రీ రెడ్డి..!

రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్న.. శ్రీ రెడ్డి..!

బయోపిక్ చిత్రాలు కాస్త రాజకీయ రంగుపులుముకుని దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తున్నాయి. మహానుభావుల జీవిత చరిత్రలు మాత్రమే బయోపిక్ గా అనుకుంటే తప్పు. ఎందుకంటే  ఇప్పుడు ఏపి ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ రాజకీయ రంగులు పులుముకొని తెర మీదకు పోటాపోటీగా వెండి తెరకెక్కుతున్నాయి. ఎన్టీఆర్ కథానాయకుడు, ఎన్టీఆర్ మహానాయకుడు, యాత్ర, లక్ష్మీస్ఎన్టీఆర్, ఇప్పుడు లక్ష్మిస్ వీరగ్రంథం బరిలో ఉంది.

క్రిష్ దర్శకత్వంలో ఎన్టీఆర్ కథానాయకుడు విడుదలైంది. ఈ నెల 22న రెండోభాగం ఎన్టీఆర్ మహానాయకుడు విడుదలకు సిద్దమవుతుంది. రాజశేఖర్ రెడ్డి జీవితచరిత్ర ఆదారంగా యాత్ర విడుదలైంది. ఇక సంచలన దర్శకుడు ఆర్.జి.వి ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ కూడా విడుదలకు రెడీ అవుతుంది. ఈ సినిమాలో లక్ష్మీ పార్వతి, ఎన్టీఆర్ జీవితంలో అడుగు పెట్టిన తర్వాత జరిగిన సంఘటనలు చూపిస్తున్నారు. ఇంతలో పోటీగా ‘లక్షీస్ వీరగ్రంధం’ చిత్రం కూడా విడుదలవుతుంది. కానీ ఈ సినిమాలో లక్ష్మి పార్వతి నెగటివ్ షేడ్ నే చూపించనున్నారు. ఈ సినిమా నుండి టీజర్ విడుదల కాగా అందులో లక్ష్మి పార్వతి నెగటివ్ షేడ్ డైలాగ్ తోనే కనిపించింది.

శ్రీరెడ్డి గ్రీన్ సిగ్నల్:

నాగరుషి ఫిలిమ్స్ బ్యానర్‌ పై సిరిపురపు విజయ భాస్కర్ రెడ్డి సమర్పిస్తున్న సినిమా ‘లక్షీస్ వీరగ్రంధం’. కేతిరెడ్డి జగదీశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నటి శ్రీరెడ్డి నటిస్తుందని అందరి గుండెల్లో దడ పుట్టించాడు. టాలీవుడ్ క్యాస్టింగ్ కౌచ్ విషయంగా సంచలనం సృష్టించి, అర్ధనగ్న ప్రదర్శన చేసింది ఈ భామ. నిన్న మొన్నటి వరకు శ్రీరెడ్డి నెగటివ్ షేడ్ లో కనిపించడానికి ఒప్పుకుంటుందో లేదో అనే ఆలోచన ఉండేది. కానీ శ్రీరెడ్డి నటించుటకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేసిందట.

srireddy
srireddy enterning into the politics

ఈ చిత్రంలో లక్ష్మీ పార్వతిని పూర్తిగా నెగిటివ్ షేడ్‌లో చూపించడానికి సిద్దపడ్డారు దర్శకులు. వీరగ్రంథం వెంకట సుబ్బారావుని పెళ్లి చేసుకుని ఒక ఉపాధ్యాయురాలిగా జీవితాన్ని కొనసాగిస్తుంది. అంతలోనే ఎన్టీఆర్ జీవితంలోకి ఏ ఉద్దేశ్యంతో అడుగు పెడుతుందో, ఎన్టీఆర్ రాజకీయజీవితం పై ఎలాంటి ప్రభావం చూపిస్తుందో  ఈ చిత్రం టీజర్ లో చూపించారు.

లక్ష్మీ పార్వతి ‘విశ్వవిఖ్యాతకే విశ్వరూపం చూపించిన దాన్ని.. నాకు మీరో లెక్కా.. రేపటి మఖ్యమంత్రిని నేనే.. నన్నెవ్వరూ ఆపలేరు.. నా దారికి ఎవ్వరు అడ్డొచ్చినా తొక్కేస్తా’ అని హాట్టహాసంగా నవ్వుతూ డైలాగ్ విసురుతుంది. ముఖ్యమంత్రి అయినట్లు కల కంటూ ప్రమాణ స్వీకారం చేస్తున్నలక్ష్మీని చూసి కలలు కంటున్నారా? అని నవ్వుతూ ప్రశ్నిస్తాడు ఎన్టీఆర్.

కొందరు నాయకులు ‘తెలుగులో విషయముందనుకున్నాం కానీ నీలో ఇంత విషముందని తెలుసుకోలేకపోయాం. పెద్దయాన బలహీనతలను వాడుకొని, సెంటిమెంట్ తో అంటుక పోయి, ఆయన ఇంటికి, వంటికి నిప్పు పెట్టాలని చూస్తున్నావని తెలుస్తుంది. జీవిత చరిత్ర రాస్తాననే నెపంతో వచ్చి, చరిత్రనే మార్చి.. పెద్దాయన జీవితంలోకి ప్రవేశించి.. మాకే యేసరు పెట్టేందుకు సిద్దపడ్డవా.. ఏదో సొంత దానివి కదా అని ఉరుకుంటుంటే.. నువ్వు ముఖ్యమంత్రి కావాలని చూస్తున్నావా.. నిన్ను ముప్పు తిప్పలు పెట్టి, మూల కూర్చో పెడతా.. నా చాణక్యం ముందు, నీ చాత చక్యమెంత. మెడ పట్టుకొని బయటకు నెట్టిస్తా’. అని వార్నింగ్ ఇస్తుంటారు. వారంతా లక్ష్మీ పార్వతిని నిలదీస్తున్న వైనం చూస్తుంటే ఎంత నెగటివ్ షేడ్ లో ఆమె పాత్ర ఉందో తెలుస్తుంది. చివరగా కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి చీకటి కోణాన్ని బయటకు తీసే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తుంది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

బ్రూస్ లీ లైఫ్ స్టోరీ..

ఈ ప్ర‌పంచంలో ప్ర‌తీరోజూ ఎంతో మంది పుడుతుంటారు. కానీ కొంద‌రు మాత్రం చ‌రిత్ర సృష్టిస్తారు. కార‌ణ‌మేదైనా స‌రే వారు మాత్రం ప్ర‌త్యేకంగా నిలుస్తారు....

Stunning Anasuya Bharadwaj

- Advertisement -Dummy Ad