
అందాల భామ ఆలియా భట్ వరుస సినిమాలతో బాలీవుడ్లో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ను అతి తక్కువ సమయంలో అందుకుంది. ఇక ఈ బ్యూటీ నటిస్తున్న సినిమాల కంటెంట్ కూడా బాగుండటంతో ప్రేక్షకులు ఆమె నటించే సినిమాలను ఆదరిస్తూ వస్తున్నారు. అయితే ఇటీవల యంగ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్యతో బాలీవుడ్లో పలు వివాదాలు రేగుతున్నాయి. ఇప్పటికే నెపోటిజం అనే విషయంపై బాలీవుడ్లో పెద్ద దుమారమే లేచింది.
ఈ క్రమంలో ఆలియా భట్ గతంలో సుశాంత్ సింగ్‌తో ప్రవర్తించిన తీరుతో ఆమెపై బాలీవుడ్ ప్రేక్షకులు పగబట్టారు. కాగా ఆలియా భట్ నటించిన లేటెస్ట్ మూవీ సడఖ్-2 ట్రైలర్‌ను ఇటీవల రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ట్రైలర్‌కు బాలీవుడ్ ప్రేక్షకులు రికార్డు స్థాయిలో డిస్‌లైకులు కొట్టారు. కాగా ఈ ట్రైలర్ ప్రపంచంలోనే ది వరస్ట్ ట్రైలర్‌గా నిలిచింది. ఇక ఈ సనిమాను ఓటీటీ ప్లాట్‌ఫాం అయిన డిస్నీ హాట్‌స్టార్‌లో సెప్టెంబర్ 28న రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అవుతోంది.
అయితే ఈ చిత్ర ట్రైలర్‌కు వచ్చిన వ్యతిరేకతతో ఇప్పుడు డిస్నీ హాట్‌స్టార్ డైలమాలో పడిందట. ఈ సినిమాపై ఉన్న వ్యతిరేకత తమ కొంప ముంచేటట్లు ఉందని ఆ ఓటీటీ నిర్వాహకులు భావిస్తున్నారట. ఈ సినిమాపై ఉన్న వ్యతిరేకత కారణంగా ఇండియాలో తమ బ్రాండింగ్ డ్రాప్ అయ్యే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు. ఏదేమైనా ఇలా ఓ హీరోయిన్ కారణంగా సినిమాతో పాటు తమ ఓటీటీకి కూడా చెడ్డపేరు వస్తుందేమో అని డిస్నీ హాట్‌స్టార్ హడలెత్తుతోంది. ఇక ఈ బ్యూటీ తెలుగులో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రం నుండి ఇటీవల వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే.