Home సినిమా టాలీవుడ్ న్యూస్ మళ్లీ పాత చింతకాయ పచ్చడి! వేదాళం రీమేక్

మళ్లీ పాత చింతకాయ పచ్చడి! వేదాళం రీమేక్

Chiranjeevi to Step into Thala Ajiths Shoes for the Telugu

కోలీవుడ్ లో 2015న విడుదలైన వేదాళం సినిమా సూపర్ సక్సెస్ అందుకుంది. శివ డైరెక్షన్, అజిత్ యాక్షన్ కు కలెక్షన్ల మోత మోగింది. దీంతో ఈ సినిమాను తెలుగులో రీమేక్ చేయాలని అనేక మంది అనుకున్నారు. చిరంజీవి రీఎంట్రీ సమయంలో మొదటి  వేదాళం సినిమాని రీమేక్ చేయాలని అనుకున్నారట. అయితే మెగాస్టార్ ఈ సినిమాని హోల్డ్ చేసి కత్తి సినిమా సెట్స్ మీదకు తీసుకువెళ్లారు. తాజా సమాచారం ప్రకారం ఈ సినిమాని మెగాస్టార్ వచ్చే ఏడాది మొదలు పెట్టనున్నారని తెలుస్తోంది. మొదట్లో ఈ సినిమాకు మెహర్ రమేష్ దర్శకత్వం వహిస్తాడని జోరుగా ప్రచారం సాగినప్పటికీ ఇప్పుడు మరో దర్శకుడు పేరు వినిపిస్తోంది.

వేదాళం మాస్ సినిమా కావడంతో వి.వి వినాయక్ అయితే సరిగ్గా సరిపోతుందని చిరు భావించారట. అందుకే ఈ సినిమాను వినాయక్ అందిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం వినాయక్ స్క్రిప్ట్ వర్క్ కూడా పూర్తి చేశాడని ఇండస్ట్రీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. గతంలో వి.వి.వినాయక్ టాగూర్ ఖైదీ నెంబర్ 150 వంటి సూపర్ హిట్ సినిమాలు అందించడంతో వినాయక్ వైపే మొగ్గు చూపినట్లు తెలుస్తోంది. ఇక వేదాళం రీమేక్ ని క్రియేటివ్ కమర్షియల్స్ బ్యానర్ లో కె ఎస్ రామారావు నిర్మించే అవకాశం ఉంది.

మరోవైపు చిరంజీవి కుటుంబానికి సన్నిహితుడైన మెహర్ రమేష్ కు ఇంకో సినిమా అందించినట్లు సమాచారం. పరిస్థితులు ఏ విధంగా ఉన్న మెహర్ రమేష్ తో  సినిమా పక్కా. వేదాళం రీమేక్ వచ్చే ఏడాది తెరకెక్కనుంది. మరోవైపు చిరు నటిస్తున్న ఆచార్య సినిమా 60 శాతం షూటింగ్ పూర్తి చేసుకుంది. ఈ సినిమాను వచ్చే ఏడాది ప్రథమార్థంలో విడుదల చేయడానికి దర్శక నిర్మాతలు సన్నద్ధమవుతున్నారు. 

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad