Home సినిమా టాలీవుడ్ న్యూస్ సినిమా అవకాశం కావాలా నాయనా !

సినిమా అవకాశం కావాలా నాయనా !

director sailesh kolanu

ఒకప్పుడు సినిమా ఇండస్ట్రీలో అడుగు పెట్టాలంటే భారీ బలం, బలగం ఉండవలసివచ్చేది. అయితే ప్రస్తుతం మారుతున్న సాంకేతిక పరిజ్ఞానం కారణంగా ఇంటర్నెట్ అందరి చేతుల్లోకి వచ్చి చేరింది. ఇంటర్నెట్లోని సోషల్ మీడియా, యూట్యూబ్, టిక్ టాక్ వంటి ప్లాట్ ఫామ్స్ అనేక మంది యువ కళాకారులకి మంచి వేదికగా తయారయ్యాయి. ముఖ్యంగా డబ్ స్మాష్&టిక్ టాక్ కుర్రకారు జోరు మామూలుగా లేదు. వీటి కారణంగా అనేక మంది సెలబ్రిటీలకు మారారు కూడా. అయితే కొంతమంది మధ్యవర్తులు వీరికి సినిమా అవకాశాలు ఇప్పిస్తామని లైంగిక దాడులు చేయడం, అసభ్యంగా ప్రవర్తించడం వంటి సంఘటన గత కొన్ని నెలలుగా జరుగుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలో హిట్ మూవీ డైరెక్టర్ శైలేష్ కొలను యువ కళాకారులకు ఓ అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చాడు. ఇండస్ట్రీలోకి వద్దాం అనుకున్నవారికి తను ఒక అవకాశం ఇస్తున్నట్లు ప్రకటించాడు. దీని ప్రకారం సినిమాల్లో నటిద్దాం అనుకున్నవారు మీకు నచ్చిన ఏదైనా ఒక సీన్‌ కు యాక్ట్ చేసి దానిని వీడియో తీసి [email protected]  మెయిల్ కు సెండ్ చేయమని పేర్కొన్నాడు. ఈ వీడియోలను తను వ్యక్తిగతంగా చూడడంతో పాటు తనకు నచ్చిన వారికి సినిమా అవకాశం ఇస్తానని తెలిపాడు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా తనకు వీడియోలు పంపించవచ్చని పేర్కొన్నాడు.

హిట్ సినిమాతో మంచి విజయం అందుకున్న శైలేష్ ఇప్పుడు ఆ సినిమాకు సీక్వెల్ తీసే పనిలో ఉన్నాడు. మరో వైపు ఈ సినిమాను బాలీవుడ్‌లోనూ రీమేక్ చేస్తున్నారనే వార్తలు గత కొద్ది రోజులుగా వినిపిస్తున్నాయి. గతంలో  డైరెక్టర్ తేజ కూడా ఆడిషన్ నిర్వహించాడు. నటన మీద ఆసక్తి ఉంటే ఒక్కసారి పైకి నుంచి చూడండి.  

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad