Home సినిమా టాలీవుడ్ న్యూస్ ఫేక్ రికార్డులతో ట్రెండ్ సెట్ చేసిన మహేష్?

ఫేక్ రికార్డులతో ట్రెండ్ సెట్ చేసిన మహేష్?

mahesh thumb 3

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రం బాక్సాఫీస్ వద్ద సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యి బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ఇంత కలెక్షన్లు వచ్చాయంటూ చిత్ర యూనిట్ చేసిన ప్రమోషన్స్ ఎలాంటి వివాదానికి దారితీశాయో అందరికీ తెలిసిందే. కాగా తాజాగా ఆగస్టు 9న(నిన్న) మహేష్ బాబు పుట్టినరోజు జరుపుకున్న సంగతి అందరికీ తెలిసిందే. ఆయన పుట్టినరోజును పురస్కరించుకుని ఫ్యాన్స్ సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ట్విట్టర్‌లో ప్రపంచ రికార్డును క్రియేట్ చేశామంటూ చెబుతున్నారు.

అయితే ఈ వరల్డ్ రికార్డులో ఎంతవరకు నిజం ఉందనే విషయంలో పలు అనుమానాలు రేకెత్తుతున్నాయి. మహేష్ పుట్టినరోజును ఎప్పటికీ గుర్తిండిపోయేలా చేసేందుకు కొంతమంది గ్రూపులుగా ఏర్పడి ఫేక్ ట్వీట్స్ ద్వారా ఈ ఘనతను సాధించారని ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మహేష్ పుట్టినరోజున నిజంగానే 60.2 మిలియన్ ట్వీట్స్ వచ్చి ఉంటే, నిజంగా అది వరల్డ్ రికార్డు అయ్యి ఉంటే, ఖచ్చితంగా గిన్నిస్ బుక్ రికార్డు వారు మరియు ట్విట్టర్ అధికారికంగా ఈ రికార్డు గురించి ప్రస్తావించే వారని పలువురు కామెంట్ చేస్తున్నారు.

గతంలోనూ మహేష్ సినిమాకు ఫేక్ కలెక్షన్స్‌ను అంటగట్టి ఇలానే అభాసుపాలయ్యారని, ఇప్పుడు మళ్లీ ఇలా ఫేక్ ట్వీట్స్‌తో నవ్వులపాలు కావద్దని మరికొందరు సూచిస్తున్నారు. నిజంగానే మహేష్ బాబు ఫ్యాన్స్ ఇలాంటి ఫేక్ రికార్డులను సృష్టించి తమ హీరో ఇమేజ్‌ను అమాంతం పెంచేయాలని చూస్తున్నారా, లేక నిజంగానే మహేష్ బాబు పేరిట ఇన్ని రికార్డులు క్రియేట్ అవుతున్నాయా అనేది తేలాల్సిన విషయం. ఏదేమైనా మహేష్ క్రియేట్ చేసిన ప్రపంచ రికార్డు ఇప్పుడు టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారింది.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad