Home సినిమా ఆగిపోయిన విజయ్ దేవరకొండ సినిమా..!

ఆగిపోయిన విజయ్ దేవరకొండ సినిమా..!

దర్శకుడు సందీప్ వంగ తీసిన అర్జున్ రెడ్డి సినిమాలో విజయ్ దేవరకొండ హీరోగా నటించాడు. ఇప్పటికి ఈ సినిమా ప్రేమికుల గుండెల్లో నిలిచిపోయింది.ఇప్పటి వరకు ఇంత డీప్ మాడ్రన్ ప్రేమ కథ సినిమా మరోటి రాలేదు. ఈ సినిమా తెలుగు లో భారీ విజయాన్ని అందుకున్న విషయం అందరికి తెలిసిందే. అందుకేఈ సినిమాను అటు హిందీలోను, తమిళంలో రీమేకు చేస్తున్నారు. అయితే కోలీవుడు లో ఈ సినిమా రీమేక్ ఇప్పుడు ఆగిపోయింది. అర్జున్ రెడ్డి తమిళ రీమేక్ ను నిలిపివేస్తున్నట్టు నిర్మాతలు ప్రకటించారు.

కోలీవుడ్ హీరో విక్రమ్ తనయుడు ‘ధృవ్’ ను హీరోగా పరిచయం చేసేందుకు మన తెలుగు అర్జున్ రెడ్డి’ సినిమాను ఎంచుకున్నారు. ఈ సినిమాను తమిళంలో ‘వర్మ’ టైటిల్ తో రీమేక్ చేశాడు. ఈ సినిమా పూర్తి బాధ్యతలను ‘శివపుత్రుడు’ దర్శకుడు బాల కు అప్పగించారు అయితే ఈ సినిమా షూటింగ్ ను బాల పూర్తి చేశాడు. పూర్తయిన సినిమా చూసిన నిర్మాతలు షాక్ తిన్నారు.

తెలుగు లో అర్జున్ రెడ్డి’ సినిమాకు తమిళ రీమేక్ సినిమాకు పూర్తిగా బిన్నంగా బాల తీశాడని నిర్మాతలు అసంతృప్తిని వ్యక్తం చేశారు. అంతే ఇక అన్ని కోట్లు పెట్టిన ఈ సినిమాను నిర్మాతలు ఆపేయమన్నారు . అర్జునరెడ్డి సినిమా కు ఈ సినిమా అస్సలు పోంతేనే లేదని బాలపై నిర్మాతలు ఆగ్రహానికి గురయ్యారట. అసలు విషయమేమనగా ఈ సినిమాలో రొమాంటిక్ సీన్స్ ఎక్కువగా ఉండటం వాళ్ళ ప్రేక్షకులనుండి విమర్శలు ఎదురుకోవాల్సి వస్తుందని ముందుగానే నిర్మాతలు గ్రహించారు. దీంతో తిరిగి వేరే దర్శకుడితో మొదటి నుంచి రీషూట్ చేయాలనే అభిప్రాయానికి వచ్చేశారట. వచ్చే నెలల్లో సినిమాను రీషూట్ చేసి జూన్ లో సినిమాను రిలీజ్ చేస్తామని ఆ వార్తలు బయటకు వచ్చాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad