Home సినిమా టాలీవుడ్ న్యూస్ రష్మికాకు అంత సత్తా ఉందా !

రష్మికాకు అంత సత్తా ఉందా !

PicsArt 08 12 06.33.13

కన్నడ ఫేం రష్మిక మంధన తెలుగులో తారాజువ్వలా దూసుకుపోతున్నారు. చలో సినిమాతో టాలీవుడ్ కు అడుగుపెట్టిన ఈ కన్నడ కుట్టి తక్కువ కాలంలోనే భారీ విజయాలను అందుకుంది. అటు శాండిల్ వుడ్ లో కూడా భారీ సినిమాలు చేస్తూ తన సత్తా చాటుతుంది. రష్మిక ఎంట్రీ తరువాత పరిస్థితి అమాంతం మారిపోయింది. ఇమె నటించిన కిరిక్ పార్టీ సినిమాను తెలుగు వారు అనువాదం లేకుండా చూసారంటే పరిస్థితి ఏంటన్నది ఇట్టే అర్థం చేసుకోవచ్చు. ఆ తరువాత శాండిల్ వుడ్ నుండి వచ్చిన కేజీయఫ్ సినిమా సినిమా తెలుగులో 50 కోట్లకు పైగా కలెక్షన్లు రాబట్టి సరికొత్త రికార్డును అందుకుంది. సౌత్ ఇండియాలో బాహుబలి తరువాత ఆ స్థాయి వసూళ్లను రాబట్టిన సినిమా కేజీయఫ్ కావటం విశేషం.

ఈ సినిమా విజయం తరువాత పలు కన్నడ అనువాద సినిమాలు టాలీవుడ్ పై దండెత్తాయి. ఇప్పుడు ఈ వరసలో రష్మిక యాక్ట్ చేసిన పొగరు సినిమా కూడా నిల్చింది. యాక్షన్ కింగ్ అర్జున్ మేన‌ల్లుడు ధృవ స‌ర్జా హీరోగా న‌టిస్తోన్న లేటెస్ట్ పాన్ ఇండియ‌న్ ఫిల్మ్ ‘పొగ‌రు. ఈ సినిమా ఇదే తెలుగులో డబ్ అవుతుంది. టాలీవుడ్ లో రష్మిక క్రేజ్ క్యాష్ చేసుకోవడానికి నిర్మాత బి.కె. గంగాధ‌ర్ పొగరు సినిమాను తెలుగులోకి అనువాదం చేస్తునట్టు తెలుస్తుంది. ఈ సినిమాపై ఫిల్మ్ ఛాంబర్లో రెండు రకాల కామెంట్స్ వినిపిస్తున్నాయి. కన్నడ సినిమాలను తెలుగు ప్రేక్షకులు చూడటం తక్కువ అని ఒక వర్గం అనగా, మరొక వర్గం మాత్రం కేజీయఫ్ రికార్డులు బద్దలు కొడుతుందని వాదిస్తున్నారు. రష్మికాకు తెలుగులో మంచి పేరున్న వసూళ్ళు రాబట్టే స్థాయి లేదని సినీ విమర్శకులు అభిప్రాయపడుతున్నారు. లాక్‌డౌన్‌ తర్వాత ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది. అప్పటిదాకా ఈ వాదప్రతివాదనలు ఇలానే కొనసాగనున్నాయి.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

జక్కన్న స్పెషల్ సర్ ప్రైజ్:ఎన్టీఆర్ టీజర్ రానుందా?

ఆర్ఆర్ఆర్ నుండి ఇప్పటి వరకు దాదాపు ఆరు అప్డేట్ విడుదలయ్యాయి. అయితే అందులోని ఏ ఒక్క అప్డేట్ లోనూ ఎన్టీఆర్ లేకపోవడంతో తారక్...

మరోసారి వివాదానికి తెరలేపిన వర్మ

టాలీవుడ్ కాంట్రవర్సీ కింగ్ రాంగోపాల్ వర్మ మరోసారి వివాదానికి తెర తీశాడు. క్రితం వరకు బయోపిక్ లతో కాలం గడిపిన వర్మ ఈసారి...

బాలీవుడ్ గురించి ఎవరికీ తెలియని నిజాలు

ఇండియాలో అతిపెద్ద సినీ మార్కెట్ ను కలిగి వున్న ఏకైక చిత్ర పరిశ్రమ బాలీవుడ్. ఈ చిత్ర పరిశ్రమ గురించి బయట ప్రపంచానికి...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad