Home సినిమా బాలీవుడ్ న్యూస్ ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

ఇండియాలోనే నెంబర్ వన్ హీరోయిన్ ఎవరో తెలుసా?

Deepika Padukone Tops First In Mood Of The Nation Survey

బాలీవుడ్ బ్యూటీ దీపికా పదుకొనే స్టార్ హీరోయిన్‌గా తనకంటూ ప్రత్యేక ఇమేజ్‌ను సొంతం చేసుకుంది. ఇప్పటికే అనేక బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటిస్తున్న ఆమె, తాజాగా మరో అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంది. ఇప్పటికే బాలీవుడ్‌లో టాప్ హీరోయిన్‌గా దూసుకుపోతున్న ఆమె, ఇప్పుడు ఇండియావైడ్‌గా టాప్ హీరోయిన్‌గా నిలిచి అందరికీ షాకిచ్చింది. ఇండియా టుడే నిర్వహించిన ‘మూడ్ ఆఫ్ ది నేషన్’ సర్వేలో హీరోయిన్లలో నెంబర్ వన్ స్థానాన్ని దీపికా అందుకుంది.

దేశవ్యాప్తంగా నిర్వహించిన ఈ సర్వేలో హీరోయిన్ల జాబితాలో నెంబర్ వన్ హీరోయిన్ ఎవరనే ప్రశ్నకు ఎక్కవ మంది దీపికా పదుకొనేకు ఓటేశారు. అయితే ఈ సర్వేలో నెంబర్ వన్‌గా నిలవడం దీపికా పదుకొనేకు కొత్త కాదు. గతంలోనూ దీపికా పదుకొనే ఈ సర్వేలో టాప్ ప్లేస్‌ను దక్కించుకుంది. కాగా ఈయేడు నిర్వహించిన సర్వేలో 16 శాతం ఓట్లను దీపిక సొంతం చేసుకుంది. ఆమె తరువాత స్థానంలో ప్రియాంక చోప్రా(14%), 3వ స్థానంలో కత్రినా కైఫ్(13%), 4వ స్థానంలో ఐశ్వర్యరాయ్(10%), 5వ స్థానంలో అనుష్క శర్మ 9 శాతం ఓట్లతో నిలిచారు.

ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ప్రభాస్ నటిస్తున్న 21వ చిత్రంలో దీపికా హీరోయిన్‌గా ఎంపికయ్యింది. ఆమె ఈ సినిమా కోసం అత్యంత భారీ బడ్జెట్‌ను అందుకుంటోంది. ఇలా అన్ని విషయాల్లోనూ టాప్ ప్లేస్‌లో నిలుస్తున్న దీపికా మూడ్ ఆఫ్ ది నేషన్ సర్వేలో టాప్ ప్లేస్‌లో నిలవడంతో ఆమె ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

- Advertisement -Sumantv Exclusive Health Tips1

Popular Stories

ఐపీఎల్‌కు అడ్డుపడుతున్న వంటలక్క

క్రికెట్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ 2020 టోర్నీని త్వరలో నిర్వహించేందుకు నిర్వాహకులు రెడీ అవుతున్నారు. కరోనా నేపథ్యంలో ఈయేడు ఐపీఎల్...

వెబ్ సిరీస్‌పై కన్నేసిన ప్రభాస్..?

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అంరదూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సాహో...

రావణుడిని వదులుతున్న ఆదిపురుష్

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ రాధేశ్యామ్ ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని అందరూ ఆసక్తగా ఎదురుచూస్తున్నారు. అయితే ఈ...

PSPK28.. ఎంటర్‌టైన్‌మెంట్ మాత్రమే కాదంటున్న పవన్

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజును పురస్కరించుకుని ఆయన నటిస్తున్న తాజా చిత్రాలకు సంబంధించిన వరుస అప్‌డేట్స్‌ను చిత్ర వర్గాలు వెల్లడిస్తూ వస్తున్నాయి....

రాబిన్‌హుడ్‌గా ప్రత్యక్షమైన పవన్.. పీక్స్ అంటోన్న ఫ్యాన్స్

పవర్ స్టా్ర్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘వకీల్ సాబ్’కు సంబంధించిన తాజా మోషన్ పోస్టర్‌ను నేడు ఆయన పుట్టినరోజు కానుకగా...
- Advertisement -Dummy Ad

Related News

- Advertisement -Dummy Ad