ఈ మధ్య ఫిల్మ్ ఇండస్ట్రీలలో బయోపిక్ ల హావా కొనసాగుతున్న విషయం అందరికి తెలిసిందే. బాలీవుడ్ భామలలో టాప్ హీరోయిన్లో ఒకరైన దీపికాపదుకొనె ఒక బయోపిక్ చేయబోతుంది. ఈమె హీరోలతో సమానమైన రెమ్యూనరేషన్ తీసుకునేంత క్రెజ్ కలదు. ఒక్కోసారి హీరోలకన్నా ఎక్కువగానే తీసుకుంటుందట. ఈ భామ చేయబోతున్న బయోపిక్ యాసిడ్ దాడి గురైన ఓ భాదితురాలిది జీవిత గాథ. తాజాగా ఈ సినిమాకు సంబందించిన దీపిక పదుకొనె ఫస్ట్ లుక్ విడుదల చేశారు చిత్ర యూనిట్.
మేఘన గుల్జార్ దర్శకత్వంలో రాబోతున్న సినిమాకి ‘ఛపాక్’ అని టైటిల్ ఖరారు చేశారు. యాసిడ్ దాడికి గురైన లక్ష్మీ అగర్వాల్ జీవితాన్ని తెరకెక్కించాలనుకుంటున్నారు. ఇప్పటివరకు గ్లామర్ పాత్రలను చేస్తూ ఎందరో అభిమానుకులను సంపాదించింది అమ్మడు.. లక్ష్మీ అగర్వాల్ పాత్రలో దీపికా పదుకొనె నటించడము గొప్ప సాహసమే అని చెప్పవచ్చు. ‘ఛపాక్’ లో ఇలాంటి తరహా పాత్రలో కనిపించడం కొత్తే అయినా, ఎలాంటి పాత్రలో నైనా మెప్పించగల నటన వాత్సల్యం తనలో ఉందనే నమ్మకంతో పదుకొనె ను చూస్ చేసుకున్నారట దర్శక నిర్మాతలు. తాజాగా యాసిడ్ దాడికి గురైన తర్వాత ఉండే పదుకొనే పేస్ ఫస్ట్ లుక్ ను విడుదల చేశారు. ఈ సినిమా 2020 సంవత్సరం జనవరి 10వ తేదీన ప్రేక్షకులను అలరించుటకు సిద్దమవుతుందని ఫస్ట్ లుక్ పోస్టర్ లోనే ప్రకటించారు. అంతేకాకుండా చిత్ర షూటింగ్ ఈరోజు మొదలవుతుందంటూ దీపికా తన ట్వీట్ లో పోస్ట్ చేసింది.